కృష్ణ

‘సంజీవని‘పై అపోహలు సృష్టించకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, : దేశ విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు, దాతల స్వచ్ఛంద విరాళాలతో నిర్మితమైన సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిపై లేనిపోని అపోహలు సృష్టించి ప్రజల్లో గందరగోళ పరిస్థితులు తీసుకు రావద్దని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలన్న దృఢ సంకల్పంతో నిర్మితమైన ఈ ఆస్పత్రి నిర్వహణ తీరుపై ఆరోపణలు రావడం బాధాకరమన్నారు. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నాట్యక్షేత్రం కూచిపూడిలో నిర్మించిన సిలికానాంధ్ర సంజీవని మల్లిస్పెషాలిటీ వైద్యాలయం ప్రథమ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో విరాళాలు ఇచ్చిన దాతల మధ్య ఘనంగా నిర్వహించారు. నాట్యాచార్య డా. వేదాంతం రాధేశ్యాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆనంద్ మాట్లాడుతూ ఆస్పత్రి నిర్మాణానికి రూ.32కోట్ల 39లక్షల 7వేల 660 వ్యయం అయినట్లు తెలిపారు. వీటిలో దేశ విదేశాలలోని 3,982 మంది దాతలు రూ.27కోట్ల 60లక్షల 11వేల 991 విరాళాలుగా ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం ఆసుపత్రిలో వైద్య పరికరాలు నిమిత్తం రూ.10కోట్లు ఇస్తామని జీవో విడుదల చేసినా నేటికీ ఆ మొత్తం మంజూరు కాలేదని కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. ఫలితంగా పరికరాల కొనుగోళ్లు నిలిచిపోయాయన్నారు. పారదర్శకంగా నిర్వహిస్తున్న తమ సంస్థపై కొందరు లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుండటం విచారకరమన్నారు. ఈ ఏడాదిలో 11,537 మంది రోగులు వైద్యసేవలు అందుకున్నారన్నారు. 3,436 మందికి చిన్నచిన్న వైద్య సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల కన్నా తమ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించినట్లు ఆయన తెలిపారు. హాస్పటల్ నిర్మాణానికి అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు తాము అనుకున్నది ఆకాశమంత ఉండగా చేసింది అణువంతగానే తాను భావిస్తున్నానన్నారు. ఏడాది లోపు మొత్తం ఆస్పత్రిలో వైద్యులకు కావల్సిన వసతి సౌకర్యాలు, వైద్య పరికరాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయి ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు తాము చేస్తున్న కృషికి అందరూ తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మిగులు కొరతను అధిగమించేందుకు విదేశాలలోని దాతలను విరాళాలు అడుగుతున్నామన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సమావేశంలో వైకెడి ప్రసాదరావు, గోపిశెట్టి రంగారావు, కోనేరు రాజేంద్రప్రసాద్, బోస్, శ్యామ్‌కుమార్, టి శ్రీనివాసరావు, బెల్లంకొండ వెంకటేశ్వరరావు, పిన్నమనేని భీమశంకరరావు, డా. గొట్టిపాటి రామకృష్ణారావు, టి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో డిస్ ప్లే ద్వారా ప్రదర్శించిన జమ ఖర్చులు, దాతల విరాళాలు, ప్రభుత్వాల అనుమతులను తిలకించిన దాతలు హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు.

ఐసీఈయూ మహాసభలను విజయవంతం చేయండి
మచిలీపట్నం (కోనేరుసెంటరు), అక్టోబర్ 18: ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లారుూస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ 51వ మహాసభ నవంబర్ 3వ తేదీన నూజివీడులో నిర్వహించనున్నట్లు ఐసీఇయు ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ కృష్ణా-గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఎల్‌ఐసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున మహాసభలో పాల్గొంటారని తెలిపారు. ఇన్సూరెన్స్ రంగంలో జరుగుతున్న పరిణామాలను, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతులు, ప్రీమియంపై జీఎస్టీ ఉపసంహరణ, మార్కెట్ షేర్‌ను కాపాడుకోవటం వంటి వివిధ అంశాలను చర్చించి తీర్మానాలను ఆమోదించనున్నారని తెలిపారు. యూనియన్ అధ్యక్షుడు జె సుధాకర్ మాట్లాడుతూ ఈ మహాసభలో ప్రముఖ సామాజిక కార్యకర్త, పారిశ్రామిక వేత్త మూల్పూరి లక్ష్మణ స్వామి ఆహ్వాన సంఘం అధ్యక్షుడుగా వ్యవహరిస్తారన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్యే కెఎస్ లక్ష్మణరావు, ఎల్‌ఐసీ ఎస్‌డీఎం పి సత్యనారాయణరావు, నవ తెలంగాణ పత్రిక సంపాదకుడు ఎస్ వీరయ్య, జోనల్ నాయకులు క్లెమెంట్ గ్జేవియర్ దాస్, యండి మోహబూబ్, పి సతీష్, కె జయతీర్ధ పాల్గొంటారన్నారు. కృష్ణా-గుంటూరు జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్ ఉద్యోగులు ఈ మహాసభలో పాల్గొని జయప్రదం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీఇయు నాయకులు జె సుధాకర్, జి కిషోర్ కుమార్, టి చంద్రపాల్, పి నాగయ్య, డి వాసు, ఎస్‌వి రత్నారావు, మల్లిఖార్జున ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతుల ప్రదానం
అవనిగడ్డ, అక్టోబర్ 18: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జరిగిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ భోగాది సుబ్రహ్మణ్యేశ్వరరావు పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. వ్యాసరచన పోటీలో ప్రథమ స్థానాన్ని జి సౌజన్య, ద్వితీయ స్థానాన్ని పి హివ