కృష్ణ

జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ‘పెద్దిరెడ్డి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. ఆదివారం రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా వ్యవహరించిన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్థానంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. రామచంద్రారెడ్డి గతంలో వైఎస్‌ఆర్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా పని చేశారు. అలాగే సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు ఆయన జిల్లా రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా కొనసాగారు. జిల్లాకు చెందిన నేతలతో అవినాభావ సంబంధాలు కలిగి ఉన్న రామచంద్రారెడ్డిని జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా నియమించడం పట్ల ఆ పార్టీ నాయకత్వం హర్షం వ్యక్తం చేస్తోంది.

ట్రైపవర్ యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం
మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 20: శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల సమత్వ సాధనతో మానసిక ప్రశాంతత, పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతాయని యోగ శిక్షకులు పంచుమర్తి రవికుమార్ అన్నారు. స్థానిక గాంధీనగర్ వాకర్స్ భవనంలో ఆదివారం ఉదయపు నడక మిత్ర మండలి, మహిళ విభాగ్ సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రవికుమార్ మాట్లాడుతూ పవన ముక్తాసన్, తాడాసన్, మేరుదండ వ్యాయామాల సమాహారమే ట్రైపవర్ యోగ అన్నారు. ట్రైపవర్ యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల సమన్వయం జరుగుతుందన్నారు. స్పాండి లైటిస్, సయాటిక మొదలగు వ్యాధులు దూరమవుతాయన్నారు. అగ్నిసార క్రియతో అనేక వ్యాధులు దూరం అవుతాయన్నారు. ప్రాణాయామంతో ప్రాణశక్తి పెరుగుతుందన్నారు. రక్త ప్రసరణ జరగని అవయవంలో వ్యాధి కలుగుతుందన్నారు. పవన్ ముక్తాసనంతో 72వేల నాడులలో రక్తప్రసరణ జరుగుతుందన్నారు. ఆహార, విహార, వ్యవహార అలవాట్లతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చన్నారు. వివిధ ఆసనాలు, ప్రాణాయామంలోని రకాలను ప్రదర్శించారు. ఉదయపునడక మిత్ర మండలి అధ్యక్షుడు మేజర్ మెహర్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వేమూరి పూర్ణచంద్రరావు, డా. మల్లికాంబ, వై జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.