కృష్ణ

పారదర్శకంగా నివేశన స్థలాల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : నివేశన స్థలాల పంపిణీలో అత్యంత పారదర్శకత పాటించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అధికారులను ఆదేశించారు. నివేశన స్థల లబ్ధిదారుల ఎంపికలో ఏ చిన్న ఆరోపణ కూడా లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నివేశన స్థల లబ్ధిదారుల ఎంపిక అంశంపై ఆదివారం నగర పాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా నివేశన స్థల లబ్ధిదారుల ఎంపిక నిమిత్తం వార్డు సభలు నిర్వహించినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పేర్లు పలు కారణాలతో జాబితా నుండి తొలగించినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి పేర్లను మరోసారి పరిశీలించి అర్హతలు గుర్తించాలన్నారు. చాలా మందికి నివేశన స్థలం లేకపోయినా ఇల్లు ఉందని, ఇంటి పన్ను మా పేరు ఉందని తమ దరఖాస్తులను తిరస్కరించాలని అన్ని వార్డుల నుండి ఫిర్యాదులు అందాయన్నారు. వీటిపై విచారణ జరిపి అర్హులతో కూడిన జాబితాలు సిద్ధం చేయాలన్నారు. తొలగించిన జాబితాను తీసుకుని మున్సిపల్ పన్ను, కరెంట్ బఇల్లు, సాధికార సర్వే, హౌసింగ్ లోన్ తదితర అంశాలన్నింటినీ మరోసారి పరిశీలించాలన్నారు. మచిలీపట్నంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికీ జీ ప్లస్ 3 గృహ నిర్మాణాలు చేపట్టి లబ్ధిదారులకు రూపాయి ఖర్చు లేకుండా గృహాలు అందజేస్తామన్నారు. చేనేత కార్మికులు, వికలాంగులను గుర్తించి ఆ కుటుంబాలకు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫ్లాట్లు కేటాయిస్తామన్నారు. అర్హులైన ఏ ఒక్కరూ నష్టపోకుండా జాబితాను సిద్ధం చేయాలన్నారు. 2007-2008లో ప్రభుత్వం తమ హయాంలో నివేశన స్థల పట్టాలు ఇచ్చామని, వివిధ కారణాలతో వారు ఇళ్లు నిర్మించుకోలేదని, ఆ లబ్ధిదారులను కూడా ఈ జాబితాలో చేర్చాలని సూచించారు. రేషన్ కార్డు ఆధారంగానే వారు నివాసం ఉంటున్న ప్రదేశాన్ని గుర్తించాలని, ఆధార్ కార్డు అయితే మార్పులు చేసుకోవచ్చని మంత్రి పేర్ని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రభఉత్వ స్థలంలో గృహాలు నిర్మించుకున్న వారందరికీ పొజిషన్ సర్ట్ఫికేట్ జారీ చేయాలని ఆదేశించారు. తండ్రి రేషన్ కార్డులో కుమారుడు ఉండి వివాహమైతే వారిని కూడా అర్హులుగా చేసి నివేశన స్థలం మంజూరు చేయాలన్నారు. అనర్హులను కూడా అర్హుల జాబితాలో చేర్చాలని అధికారులపై ఎవరైనా ఒత్తిడి తీసుకు వస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గృహాలు లేని నిరుపేదలకు నివేశన స్థలాలు ఇవ్వాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. అందుకు అనుగుణంగా ఉద్యోగులు, ప్రజా ప్రతినిథులు ఎటువంటి అపోహలకు తావివ్వకుండా లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ అనూష, తహశీల్దార్ సునీల్, మెప్మా పీడీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.