కృష్ణ

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు) : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులదే కీలక పాత్ర అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన ఆదివారం నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు, అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు స్వీయ పర్యవేక్షణలో ఉదయం చిలకలపూడి పోలీసు స్టేషన్‌లో ఓపెన్ హౌస్ నిర్వహించగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ రకాల ఆయుధాలను ప్రదర్శించారు. నగరంలోని పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు ఆయుధాల పనితీరును వివరించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆర్‌ఎంఓ డా. విజయ నిర్మల ఆధ్వర్యంలో డా. అనే్వష్ కుమార్, డా. భాస్కర్, డా. హరీష్, డా. రంగనాధ్, డా. జయశ్రీ బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే సాయంత్రం నగరంలో అమరవీరులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రేవతి సెంటరు నుండి కోనేరుసెంటరు వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ విజయరావు, బందరు డీఎస్పీ మెహబూబ్ బాషా, ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎఆర్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు చంద్రాశేఖర్, వెంకట నారాయణ, కొండయ్య, వెంకటేశ్వరరావు, ఆర్‌ఐలు చంద్రశేఖర్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.