కృష్ణ

అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో జరిగిన తప్పిదాలే మరలా పునరరావృతం కాకుండా చూడాలన్నారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజలు భూ సమస్యలు, పాస్‌పుస్తకం, ఆన్‌లైన్ సమస్యలు, రైతు భరోసా వంటి సమస్యలపై అర్జీలు ఎక్కువగా అందజేస్తున్నారని తెలిపారు. జనవరి నుంచి తహశీల్దార్, మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా గ్రామాలలో ఏర్పాటు చేసిన సచివాలయాల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చన్నారు. మండలంలో అన్‌లైన్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు పారదర్శకంగా పని చేసి అర్హులను ఆన్‌లైన్‌లో చేర్చాలని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి శీలం ప్రకాశరావు కౌలు రైతులకు రైతు భరోసా పథకం అందేలా చర్యలు తీసుకోవాలని, వరదల్లో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందేలా కృషిచేయాలని అర్జీలో విన్నవించుకున్నారు. వల్లూరుపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆరు నెలల నుంచి తెలుగు పండిట్ లేడని, తెలుగు పండిట్‌ను నియమించాలని గ్రామస్తులు కోరిన ఎంఈఓ నిర్లక్ష్యంగా సమాధనం చెప్తున్నారని, వెంటనే తెలుగు పండిట్‌ని నియమించాలని అర్జీలో విన్నవించారు. ఇలా పలు సమస్యలుపై స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యేకు మండల ప్రజలు అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కట్టా వెంకట శివయ్య, వైసిపి మండల కన్వీనర్ జొన్నల రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, ఎంపిడిఓ టి స్వర్ణలత, మాజీ ఎంపీటీసీ సభ్యులు పిఎస్ కోటేశ్వరరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ నిధుల కోసం ఉద్యమిస్తాం
* ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్
పామర్రు, అక్టోబర్ 21: ఉపాధి హామీ పథకం కింద వ్యయపర్చిన నిధులు పొందడానికి ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి పార్లమెంట్‌ను ముట్టడించే స్థాయి ఉద్యమాన్ని తీసుకువెళతామని రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఉపాధి హామీ నిధులు కేంద్రం విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. సోమవారం పామర్రులో పంచాయతీ రాజ్ ఛాంబర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైవిబి మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు కేంద్రం రూ.2500కోట్లు విడుదల చేయగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి మళ్లించిందన్నారు. ఫలితంగా గతంలో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తీవ్రంగా నష్టపోవల్సి వచ్చిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాసరనేని శ్రీనివాసరావు, వీరంకి వెంకట గురుమూర్తి, గొట్టిపాటి లక్ష్మీదాస్ తదితరులు పాల్గొన్నారు.