కృష్ణ

అమరుల త్యాగాలతోనే స్వేచ్ఛా స్వాతంత్య్ర జీవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: దేశ రక్షణ కోసం వీర మరణం పొంది యోధులుగా నిలిచిన పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. అమరుల త్యాగాలు దేశానికి పెట్టని కోటగా కోట్లాది మంది భారతీయుల స్వేచ్ఛా జీవనానికి మార్గాన్ని సుగమం చేస్తున్నాయన్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం నిర్వహించిన పోలీసు అమరవీరుల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు, అడిషనల్ సూపరింటెండెంట్ మోకా సత్తిబాబు, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు దూలం నాగేశ్వరరావులతో కలిసి మంత్రి పేర్ని నాని పోలీసు అమరుల వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ తన సందేశాన్ని అందించారు. 1959 అక్టోబర్ 21వతేదీన దేశ గౌరవం కోసం దేశ రక్షణ కోసం తుది శ్వాస వరకు పోరాడిన నాటి వీర జవాన్ల స్ఫూర్తితో నేటికీ దేశ రక్షణలో మనందరి సుఖ శాంతుల కోసం వందలాది మంది వీర మరణం పొందుతూనే ఉన్నారన్నారు. గడిచిన యేడాదిలో దేశ వ్యాప్తంగా 292 మంది ప్రాణ త్యాగం చేశారన్నారు. వారి త్యాగ ఫలితం దేశానికి రక్షణగా మనందరికీ స్వేచ్ఛా స్వాతంత్రాలతో కూడిన జీవితాన్ని ప్రసాదించిందన్నారు. జవాన్ల వీర మరణంతో వారి కుటుంబాలకు ఏర్పడిన నష్టం, కష్టాన్ని ఎవ్వరూ పూడ్చ లేనిదన్నారు. కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి మన కోసం మన దేశం కోసం జీవితాల్ని అంకితం చేశారన్నారు. శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ శాంతియుత సమాజ స్థాపన ఘనత పోలీసులదేనన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను మరువరాదన్నారు. వారి త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలన్నారు. అనంతరం గడిచిన యేడాదిలో దేశ వ్యాప్తంగా అమరులైన 292 మంది అమర పోలీసుల పేర్లను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు చదివి వినిపించారు. వారి సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరుల స్మారక స్థూపానికి పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్ నుండి కోనేరుసెంటరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ విజయరావు, బందరు డీఎస్పీ మెహబూబ్ బాషా, ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎఆర్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు చంద్రశేఖర్, మోర్ల వెంకట నారాయణ, కొండయ్య, వెంకటేశ్వరరావు, అఖిల్ జమా, ఆర్‌ఐలు చంద్రశేఖర్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

మూలలంకలో పోలీసు అమరవీరుడికి నివాళి
కలిదిండి: విధి నిర్వహణలో మన పోలీసులు ఎన్నో త్యాగాలు చేశారని 24 గంటలు విధి నిర్వహణలో ఉండి సమాజంలో శాంతి భద్రతలకు కృషి చేస్తున్నది పోలీసు శాఖ అని కైకలూరు సీఐ కెఎంవి జయకుమార్ అన్నారు. సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మండలంలోని మూలలంక గ్రామంలోని అమరుడై కర్రి మనోజ్ కుమార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయస్సులో అమరుడైన మనోజ్ తల్లిదండ్రులను పలకరించారు. పోలీసు శాఖ అన్ని శాఖల కన్నా కఠినమైనదన్నారు. ఈ కార్యక్రమంలో కలిదిండి ఇన్‌ఛార్జి ఎస్‌ఐ రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ చలపతిరావు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసుల కొవ్వొత్తుల ప్రదర్శన
కూచిపూడి, అక్టోబర్ 21: పోలీసు అమరవీరుల త్యాగాల ఫలితంగా ప్రజలు సుఖ శాంతులతో ఎటువంటి భయం లేకుండా గడుపుతున్నారని కూచిపూడి ఎస్‌ఐ కె ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక పెదపూడి, కూచిపూడి ప్రధాన కూడలిలో కొవ్వొత్తులు వెలిగించి పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పించారు. పగలు, రాత్రి ప్రజలకు శాంతి భద్రతలు కల్పించటంలో పోలీసులు ప్రజల మన్ననలు అందుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.