కృష్ణ

కృష్ణ.. కృష్ణ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: కృష్ణా విశ్వ విద్యాలయం వ్యవహారం చూసి కృష్ణ.. కృష్ణ అంటున్నారు. విశ్వ విద్యాలయం పెద్దల నిర్వాకం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. ప్రతి అంశంలోనూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ వస్తున్న కృష్ణా విశ్వ విద్యాలయం ఈ విడత మూడవ సంవత్సరం బీటెక్ విద్యార్థుల ప్రశ్నా పత్రంలో తప్పుల తడకలు చోటు చేసుకున్నాయి. మూడవ సెమిస్టర్ పరీక్షలకు రెండవ సెమిస్టర్ సిలబస్‌తో ప్రశ్నా పత్రాలు ఇవ్వటంతో విద్యార్థులు ఒక్కసారిగా కంగుతిన్నారు. కృష్ణా విశ్వ విద్యాలయం అనుబంధ కళాశాలల్లో ఈ నెల 18వతేదీ నుండి మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం మూడవ సెమిస్టర్ విద్యార్థులకు కమ్యూనికేషన్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ సబ్జెక్టు పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రంలో మూడవ సెమిస్టర్‌కు సంబంధించిన సిలబస్ కాకుండా రెండవ సెమిస్టర్‌కు సంబంధించిన సిలబస్ రావటాన్ని గుర్తించిన విద్యార్థులు విస్తుపోయారు. విషయాన్ని తమ తల్లిదండ్రుల ద్వారా విశ్వ విద్యాలయం అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో లోపాన్ని గుర్తించిన విశ్వ విద్యాలయం పెద్దలు దిద్దుబాటు చర్యలను క్షణాల్లో చేపట్టారు. ఔటాఫ్ సిలబస్ వచ్చిన కారణంగా ఈ నెల 30వతేదీ మధ్యాహ్నం పునః పరీక్ష నిర్వహించనున్నట్లు విశ్వ విద్యాలయం పరీక్షల విభాగం కో-ఆర్డినేటర్ డా. సిహెచ్ జయశంకర ప్రసాద్ పత్రికా ముఖంగా తెలియజేశారు. ఈ విషయంలో విద్యార్థులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. పునః పరీక్షపై విశ్వ విద్యాలయం అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ అందరికీ సమాచారం ఇచ్చామన్నారు. ఇదిలా ఉంటే విశ్వ విద్యాలయం పెద్దల నిర్వాకాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. సంబంధం లేని సిలబస్‌తో ప్రశ్నా పత్రాలు ఎలా తయారు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నా పత్రాలు తయారు చేసేది విశ్వ విద్యాలయం అధ్యాపకులే కదా అలాంటప్పుడు తప్పులు ఎందుకు దొర్లుతాయన్న ప్రశ్నలను కూడా సంధిస్తున్నారు. ఏది ఏమైనా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే విధంగా తప్పుల తడకగా ప్రశ్నా పత్రాలు తయారు చేసిన సంబంధిత విశ్వ విద్యాలయం అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి పవన్ కుమార్ డిమాండ్ చేశారు.

తడిసి ముద్దయిన వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 22: ఎక్కడైనా కార్యాలయాల చుట్టూ వర్షపునీరు చేరడం మనం చుస్తూ ఉంటాం. కానీ జిల్లా వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయం మాత్రం అందుకు భిన్నం. వర్షం పడితే జేడీ కార్యాలయం నిండుకుండలా మారిపోతుంది. స్థానిక రుస్తుంబాదలో ఎంతో కాలంగా జేడీ కార్యాలయం అద్దె భవంతిలో కొనసాగుతోంది. ఈ భవంతి అతి పురాతనమైనది కావటంతో కొద్దిపాటి వర్షానికే శ్లాబు నుండి వర్షపునీరు కారుతుంది. అదే ఓ మాదిరి వర్షమైతే కార్యాలయం మొత్తం వర్షపునీటితో నిండిపోవల్సిందే. విధులు నిర్వర్తించడం ఆ శాఖ ఉద్యోగులకు కష్టతరంగా మారుతుంది. మంగళవారం తెల్లవారు జాము నుండి జోరుగా కురిసిన వర్షానికి పరిస్థితి మరింత దారుణంగా మారింది. కంప్యూటర్లు, ఆఫీస్ టేబుళ్లన్నింటిపైనా పరదాలు కప్పి వర్షపునీటి నుండి కాపాడుకోవల్సిన పరిస్థితి వచ్చింది. ఈ శాఖకు సొంత భవనం ఉన్నప్పటికీ చాలీ చాలని ఇరుకు గదులతో ఉన్న అద్దె భవంతిలోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కలెక్టరేట్‌లో నిర్మించిన వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయంలో మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కార్యాలయం కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో ముడా ఏర్పాటు కాగా సొంత భవనం లేక నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయాన్ని ఎంచుకున్నారు. నాటి నుండి నేటి వరకు ముడా కార్యాలయం వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయంలో కొనసాగుతోంది.