కృష్ణ

బదిలీల్లో కలెక్టర్ మార్క్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 23: జిల్లా కలెక్టర్ బాబు.ఎ పంతం నెగ్గించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల్లో భాగంగా తన సొంత శాఖ అయిన ‘రెవెన్యూ’ను భారీగా ప్రక్షాళన చేశారు. ఆఫీస్ సబార్డినేట్ నుండి మండల తహశీల్దార్ల వరకు పెద్దఎత్తున బదిలీలు చేశారు. 22 మంది తహశీల్దార్లతో పాటు 31 మంది డెప్యూటీ తహశీల్దార్లు, 32 మంది సీనియర్ అసిస్టెంట్లు, 19 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు టైపిస్టులు, 265 మంది విఆర్‌ఓలు, ఏడుగురు డ్రైవర్లు, 19 మంది ఆఫీస్ సబార్డినేటర్లకు స్థానచలనం కల్పించారు. రెండు, మూడు రోజులుగా రెవెన్యూ శాఖలో బదిలీల వ్యవహారం తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. ఏమేర బదిలీలు ఉంటాయో? ఎవరెవరికి స్థానచలనం కలుగుతుందో?.. అని అధికార వర్గాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. రాజకీయ జోక్యం చోటుచేసుకున్నా కలెక్టర్ బాబు.ఎ ఆచితూచి వ్యవహరించి రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసినట్టు తెలుస్తోంది. బదిలీల విషయంలో ఎన్నో ఒత్తిళ్లకు గురైన కలెక్టర్ ఎట్టకేలకు తాను అనుకున్న స్థాయిలో జరిపారు. తహశీల్దార్ల పనితీరును పరిగణనలోకి తీసుకోవటంతో పాటు అవినీతి ఆరోపణలున్న అధికారుల పట్ల చాకచక్యంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. తహశీల్దార్ల బదిలీల విషయంలో రాజకీయ సిఫార్సులు కొంతమేర మాత్రమే పనిచేసినట్టు సమాచారం. ముసునూరు తహశీల్దార్ విజయలక్ష్మిని తొలుత కలెక్టరేట్‌కు బదిలీ చేయాలని కలెక్టర్ భావించగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒత్తిడి మేరకు ఆమెను చివరి నిమిషంలో నూజివీడుకు బదిలీ చేసినట్టు సమాచారం. అలాగే బందరు తహశీల్దార్ నారదమునిని బదిలీ చేయాలని కలెక్టర్ భావించగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర అండదండలతో ఆయన బదిలీ నిలిచిపోయింది. బందరు పోర్టు నేపథ్యంలో భూసేకరణకు సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉన్న నారదమునిని ఇక్కడి నుండి పంపించేందుకు మంత్రి రవీంద్ర అంగీకరించలేదు. దీంతో నారదమునిని బందరు తహశీల్దార్‌గానే కొనసాగించాల్సి వచ్చింది. ఇలా ఒకటి, రెండు రాజకీయ సిఫార్సులు మాత్రమే తహశీల్దార్ల బదిలీల్లో పని చేసినట్టు తెలుస్తోంది.