కృష్ణ

ధాన్యం కొనుగోలులో ఫిర్యాదులు లేకుండా చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఖరీఫ్ ధాన్యం సేకరణలో ఫిర్యాదులు లేకుండా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో తేమ శాతం కొలిచే యంత్రం, ధాన్యం కొనుగోలుకు సంబంధించి కంప్యూటర్‌లో ఆన్‌లైన్ నమోదు, రిజిష్టర్లలో నమోదు పక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 6.19లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు గాను 260 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు గత నెల 24వతేదీ నుండి వివిధ దశల్లో సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను నూరు శాతం కొనుగోలు కేంద్రాలకు తరలించే విధంగా రైతుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె రాజ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.