కృష్ణ

మాట ఇచ్చాం.. చేసి చూపాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో గత ప్రభుత్వం కంచే చేనును మేసిన చందాన వ్యవహరించిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. గురువారం స్థానిక జడ్పీ కనె్వన్షన్ హాలులో అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ల చెల్లింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలంతా పైసాపైసా కూడబెట్టిన తమ కష్టార్జితాన్ని అగ్రిగోల్డ్ సంస్థలో దాచుకుంటే సదరు సంస్థ వారి నెత్తిన కుచ్చు టోపీ పెట్టిందన్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులపై కనే్నసిందే తప్ప బాధితులకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కష్టార్జితం కోసం బాధితులు చేసిన ఉద్యమానికి నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహనరెడ్డి అండగా నిలిచారన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో గోడు వెళ్లబోసుకున్న ప్రతి ఒక్క అగ్రిగోల్డ్ బాధితుడికి ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఏర్పడిన ఐదు మాసాల్లో బాధితులకు న్యాయం చేయగలిగామన్నారు. తొలిగా రూ.10వేలు లోపు డిపాజిట్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ సంబంధిత మొత్తాన్ని తిరిగి చెల్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. జిల్లాకు సంబంధించి 21వేల 444 మంది బాధితులకు రూ.15కోట్ల 77వేల 760లు మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. దేశ చరిత్రలో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ చేతిలో మోసపోయిన బాధితులకు తిరిగి చెల్లింపులు చేయడం చారిత్రాత్మకమన్నారు. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా తమకేమీ పట్టనట్టు వ్యవహరించారని మండిపడ్డారు. రూ.20వేలు లోపు డిపాజిట్లు చేసిన వారికి కూడా త్వరలోనే చెల్లింపులు చేస్తామన్నారు. ఒక్క అగ్రిగోల్డ్ బాధితులే కాదు అర్హతలు కలిగిన ప్రతి ఒక్క పేద వాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నదే తమ ప్రభుత్వ దృఢ సంకల్పమన్నారు. సంక్షేమ ఫలాలను వేగవంతంగా ప్రజల దరికి చేర్చేందుకు జనవరి 1వతేదీ నుండి సచివాలయ వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే సచివాలయాల ద్వారా సంబంధిత దరఖాస్తు కార్యరూపం దాల్చనుందన్నారు. అమ్మఒడి పథకం ద్వారా కూడా ప్రజలకు మరింత చేరువ కానున్నట్లు చెప్పారు. 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లల తల్లులకు అమ్మ ఒడి ద్వారా యేడాదికి రూ.15వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అమ్మ ఒడి పథకానికి తెల్ల రేషన్ కార్డు నిబంధన ఏ మాత్రం లేదన్నారు. తెల్ల రేషన్ కార్డు లేకున్నా గతంలో వారు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుని ఉంటే ఖచ్చితంగా అమ్మ ఒడి పథకానికి అర్హత లభిస్తుందన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తొలి కేబినెట్ సమావేశం నుండే కసరత్తు ప్రారంభించారన్నారు. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ చెల్లింపుదారులను నిలువునా మోసం చేసింది తప్ప వారికి ఏ మాత్రం భరోసా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ముడా వీసీ విల్సన్ బాబు, ఆర్డీవో ఖాజావలి, మెప్మా పీడీ సూర్యనారాయణ, సీఐడీ డీఎస్పీ సుబ్బరాజు, అగ్రిగోల్డ్ విజయవాడ పార్లమెంటరీ కన్వీనర్ అడపా శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.