కృష్ణ

క్రీడల్లో గ్రామీణ యువత రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిదిండి, : గ్రామీణ ప్రాంతాలలో క్రీడలు యువకులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కైకలూరు శాసనసభ్యుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కోట కలిదిండిలో శ్రీ పాతాళ భోగేశ్వర స్వామివారి రాష్ట్ర స్థాయి చెడుగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు దేహదారుఢ్యాన్ని పెంచుతాయని, కంప్యూటర్ రంగంలో కాలుష్యం పెరిగిపోతోందన్నారు. ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు.
చెడుగుడు పోటీ క్రీడాకారులను అభినందించారు. అనంతరం కోట కలిదిండి మహిళలను కలిసి రోడ్లు, డ్రైనేజీ సమస్యలు గురించి తెలుసుకుని తక్షణమే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కైకలూరు నియోజకవర్గంలో 109 గ్రామ సచివాలయాల అభివృద్ధి చేయటానికి కృషి చేస్తానన్నారు. అనంతరం వెంకటాపురంలో శ్రీ చింతలమ్మ అమ్మవారిని కార్తీక ఏకాదశి సందర్భంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా అధ్యక్షుడు నీలపాల వెంకటేశ్వర రావు, చిట్టూరి బుజ్జి, గోదావరి సత్యనారాయణ, వెంకటరెడ్డి, కరేటి భాస్కర్, పేకేటి సత్యనారాయణ, కందుల వెంకటేశ్వరరావు, చిట్టూరి నాగేశ్వరరావు, రాష్ట్ర మహిళ కార్యదర్శి నంబూరి శ్రీదేవి, బాబి మారగాని భోగేశ్వరరావు, గంటా వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
చిలకలపూడిలో వైభవంగా
పాండురంగ స్వామి కల్యాణం
మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 8: స్థానిక చిలకలపూడి శ్రీ పాండురంగ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కార్తీక ఏకాదశి మహోత్సవాలలో భాగంగా రెండవ రోజైన శుక్రవారం శ్రీ రుక్మిణీ, శ్రీ పాండురంగ స్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నిర్వహించిన సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు సతీ సమేతంగా అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
రాత్రి సుప్రసిద్ధ సంగీత కళాకారిణి సింగరాజు కల్యాణి నిర్వహించిన భక్తి సంగీత విభావరి భక్తులను రంజింప చేసింది. శ్రీ రామమోహన నాట్య మండలి సభ్యులు ప్రదర్శించిన భక్త చింతామణి నాటకం ప్రేక్షకులను అలరించింది. ఈ కార్యక్రమాలను భక్త నరసింహం మనుమడు టేకి గంగాధరం, టేకి నరసింహం తదితరులు పర్యవేక్షించారు.

వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
అవనిగడ్డ, నవంబర్ 8: మండల పరిధిలో కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు దేవాలయాలలో ఆధ్యాత్మిక శోభ వెల్లి విరిసింది. అవనిగడ్డ, వేకనూరులోని శివాలయాలలో తెల్లవారు జాము నుండే అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగా స్థానిక శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో లక్ష తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. ఆగమ పండితుడు డి ఫణికుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగ్గా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, లక్ష్మి దంపతులు, కె నరసింహారావు, శ్రీలక్ష్మి దంపతులు, ధర్మకర్తలు పోతరాజు భాస్కరరావుదంపతులు, వేణుగోపాల కృష్ణమూర్తి దంపతులు ఉభయ దాతలుగా పంచామృతాలతో అభిషేకాలు, పూజలు, అలంకారాలు నిర్వహించారు. అర్చక స్వాములు గోమాతకు గోపూజలు నిర్వహించారు. ఆలయ ఇఓ ఆంజనేయ స్వామి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ప్రభుత్వ ధరకు భూములమ్మేవారు సంప్రదించండి
కూచిపూడి, నవంబర్ 8: మొవ్వ మండలంలోని పేదలకు నివేశన స్థలాల పంపిణీ కోసం భూమి హక్కుదారులు ప్రభుత్వ ధరకు అమ్మేందుకు సిద్ధమైతే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మొవ్వ తహశీల్దార్ డి రాజ్యలక్ష్మి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాల కార్యక్రమంలో భాగంగా పేదలకు సొంత ఇల్లు ద్వారా మండలంలోని పెడసనగల్లు, పెదపూడి, కూచిపూడి, యద్దనపూడి, భట్లపెనుమర్రు, కోసూరు, మొవ్వ, కాజ గ్రామాల పరిధిలో రైతులు ప్రభుత్వం ధరకు భూములు ఇచ్చేందుకు సిద్ధమైతే తెలియపర్చాలని ఆయన కోరారు. మండలంలో వైఎస్‌ఆర్ సొంత ఇల్లు కార్యక్రమం ద్వారా 1200 మంది సొంత భూములు కలిగిన వారికి పక్కా గృహాలు నిర్మించుకునేందుకు త్వరలో అనుమతులు మంజూరవుతాయన్నారు. ప్రభుత్వం వలంటరీ అక్విజేషన్ ల్యాండ్ చట్టం ప్రకారం రైతులు ప్రభుత్వ ధరకు భూములు ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు.

ఉనికి కోసమే ఉమా పాట్లు
* ఎమ్మెల్యే కేపీ
మైలవరం, నవంబర్ 8: ప్రజాక్షేత్రంలో ఓడిపోయినా ఉనికి కోసం పాట్లు పడుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిచ్చి వాగుడు మానకుంటే ఇంటికొచ్చి నిలదీస్తానని మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తీవ్రంగా హెచ్చరించారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో విలేఖర్లతో మాట్లాడుతూ తాను ఇసుక దందా చేస్తున్నానని, విజయవాడ, హైదరాబాద్‌లలో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నానని ఉమా తనపై ఆరోపణలు చేస్తున్నాడని తాను నిజంగా ఇసుకను అమ్ముకుంటున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. తాను 33 ఏళ్ళుగా అయ్యప్ప దీక్షలు తీసుకుంటున్నానని, అయ్యప్ప దేవాలయానికి తాను వచ్చి ప్రమాణం చేస్తానని, ఉమా కూడా వచ్చి ఆయన చేసిన ఆరోపణలపై ప్రమాణం చేయాలని కేపీ సూచించారు. గడచిన 20 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన ఉమా ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓడిపోయే సరికి తట్టుకోలేకపోతున్నాడన్నారు. జన్మభూమి కమిటీలతో, నీరు-చెట్టు పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని నేడు శ్రీరంగ నీతులు పలుకుతున్నాడంటూ ధ్వజమెత్తారు. దందాలు, పైరవీలు, దోపిడీ చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడితే తాను సమాధానం చెబుతానన్నారు. ఈ సమావేశంలో నేతలు పామర్తి శ్రీనివాసరావు, అప్పిడి సత్యనారాయణరెడ్డి, జొన్నలగడ్డ గంగాధరరావు, రహీమ్, కరీమ్ తదితరులు పాల్గొన్నారు.

నీటి గుంటలో పడి బాలుడు మృతి
నందిగామ, నవంబర్ 8: ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి ఒక బాలుడు మృతి చెందిన సంఘటన నందిగామ శివారు అనాసాగరం వద్ద శుక్రవారం జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన బేరోతుల సత్యం బాబు కుమారుడు గోపీచంద్ (9) గ్రామంలోని ఎలిమెంటరీ స్కూల్‌లో నాల్గవ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం స్కూల్ వదిలిపెట్టిన తరువాత సహచర స్నేహితులతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు హైవే పనుల నిర్మాణం కోసం 12అడుగులు తీసిన గోతిలో బాలుడు గోపీచంద్ పడ్డాడు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గుంటలో నీరు నిండుగా ఉండటంతో ఊపిరాడక మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైవే అధికారులు నిర్లక్ష్యంగా తీసిన గొయ్యి పూడ్చకపోవడం వల్లనే బాలుడు మృతి చెందాడని బాలుడు బంధువులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

చలో విజయవాడను విజయవంతం చేయాలి
అవనిగడ్డ, నవంబర్ 8: రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు కోరారు. 11వతేదీన ఉదయం 11గంటలకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేయించిన మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, కాంట్రాక్టర్లు ఈ ధర్నాలో పాల్గొనాలని వారు కోరారు. పంచాయతీ రాజ్ చాంబర్ ద్వారా గతంలో ఎన్నో హక్కులు సాధించుకున్నామని, ఉపాధి హామీ నిధుల సాదనకు 11న అలంకార్ థియేటర్ దగ్గర జరిగే ధర్నాకు అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ గాజుల మురళీకృష్ణ, బండే రాఘవ, బచ్చు రాంప్రసాద్, మండలి వెంకట రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా అంతకు ముందు పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుకపై స్పష్టత లేని కారణంగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి త్వరలో ఇంటికి వెళ్లే పరిస్థితి ఏర్పడుతోందని టీడీపీ నాయకులు విమర్శించారు.
కౌలు రైతులకు భరోసా కల్పించాలి
కూచిపూడి, నవంబర్ 8: జిల్లాలోని కౌలు రైతులకు రైతు భరోసా పథకాన్ని వర్తింప చేయాలని మొవ్వ మండల కౌలు రైతుల సంఘం కార్యదర్శి చేబ్రోలు భాస్కరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రై తు భరోసా పథకానికి అర్హులైన రైతులు నుం డి శుక్రవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించా రు. ఈ సందర్భంగా వేములమడ గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కూరపాటి కృష్ణమూర్తి, మండల మాజీ కార్యదర్శి మద్దుల బసవయ్య, వి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

భవానీ దీక్షలు ప్రారంభం
* దీక్షాపరులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి,నవంబర్ 8: జై దుర్గా... జయ జయ దుర్గా .. జై భవానీ అంటూ భక్తులు అమ్మవారి సన్నిధిలో ఆమెకు ప్రీతిపాత్రమైన భవానీ దీక్షలను భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వేకువ జామునే పవిత్ర స్నానాలు ఆచరించి శుక్రవారం ఉదయం శ్రీ మల్లిఖార్జున మహామండపం 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఉత్సవ మూర్తి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుని అర్చక స్వాముల ఆధ్వర్యంలో భవానీదీక్షలు స్వీకరించారు. అర్ధమండల దీక్షలు స్వీకరించిన భవానీలు 41 రోజులుపాటు అమ్మవారి భవానీదీక్షలో ఉండి అనంతరం డిసెంబర్ 18నుండి విరమణ చేస్తారు. శ్రీ చక్ర రాజ పుర వాసిని శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్ మల్లిఖార్జున మహామండపం 6వ అంతస్తులో దేవస్ధానం ఈవో ఎంవీ సురేష్ దంపతులను ఉత్సవమూర్తి ముందు కూర్చోబెట్టి నిష్ఠతోకలశస్థాపన, విఘ్నేశ్వర పూజ వంటి పూజలు చేయించారు. అనంతరం హోమగుండంలో అగ్ని ప్రతిష్ఠాపన చేయించారు. ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం మూలవిరాట్ మెడలో వేసిన దీక్షా మాలలను తీసుకొచ్చి దీక్షాపరుల మెడలో వేశారు. తొలుత అమ్మవారి ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ మల్లిఖార్జున మహామండపంలో వేదికపై స్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా వచ్చిన భక్తులు ఈ భవానీదీక్షలు స్వీకరించారు. తొలిరోజే అధికంగా భక్తులు భవానీదీక్షలు స్వీకరించారు.

మైనారిటీ డేను విజయవంతం చేయండి
* అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి
* కలెక్టర్ ఇంతియాజ్
విజయవాడ(సిటీ), నవంబర్ 8: ఈనెల 11న జాతీయ విద్యాదినోత్సవం, మైనారిటీస్ డే సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు సమన్వయం చేసుకుని పూర్తిచేయాలన్నారు. నగరంలలోని ఏ ప్లస్ కనె్వన్షన్ సెంటర్‌లో శుక్రవారం ఏపీ ప్రభుత్వ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల తులసీరామ్‌తో కలిసి కలెక్టర్ సీఎం పర్యటనా ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఈనెల 11న అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనారిటీ దినోత్సవాన్ని, అదేరోజు జాతీయ విద్యాదినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఇందుకు సంబంధించి ఏ ప్లస్ కనె్వన్షన్ హాలులో మైనారిటీ సంక్షేమశాఖ, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం అవరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై తన సందేశాన్ని అందిస్తారని తెలిపారు. అలాగే వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభకనబరించిన 72మందికి మైనారిటీ దినోత్సవం సందర్భంగా అవార్డులను, 301 మంది విద్యార్థులకు విద్యాపురస్కారాలను జాతీయ విద్యాదినోత్సవం సందర్భంగా సీఎం అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. ఈకార్యక్రమానికి మొత్తం 2వేల మంది హాజరైయ్యే అవకాశం ఉన్నందున ఈ దిశగా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే కే అనిల్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారిణి రాజ్యలక్ష్మీ, జిల్లా మైనారిటీ అధికారిణి రజియాసుల్తాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓ హేమచంద్ర, విజయవాడ ఉపవిద్యాశాఖాధికారిణి, తదితరులు పాల్గొన్నారు.

ప్రజాహృదయ ‘స్పందన’
మానవీయకోణంలో చూడాలి
పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలన్న గోపాలకృష్ణ ద్వివేదీ
విజయవాడ (క్రైం), నవంబర్ 8: ప్రజా హృదయ స్పందనను మానవీయకోణంతో పరిశీలించి సంతృప్తి స్ధాయిలో పరిష్కారం చూపాలని పంచాయతీ రాజ్ శాఖా ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ చెప్పారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం స్పందన అర్జీల పరిష్కారం కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన జిల్లా, పురపాలక, మండలస్ధాయి అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ స్పందనలో వస్తున్న అర్జీల పరిష్కారంలో సంఖ్యాపరంగా చూడకుండా సంతృప్తి, నాణ్యతతో అర్జీ పరిష్కరించడంపైనే పూర్తి దృష్టి పెట్టాలన్నారు. రానున్న జనవరి నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాలు పూర్తి స్దాయిలో పని చేస్తాయని అప్పటికీ వాటిని మంచి స్పందన కేంద్రాలుగా తీర్చి దిద్దాలన్నారు. ఇందుకు తగిన రీతిలో గ్రామ వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శిక్షణ అందించాలన్నారు. ప్రతీ గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కౌంటర్లు నిర్వహించబడతాయన్నారు. ఇకపై స్పందనలో అందే అర్జీల పరిష్కార తీరును సోషల్ ఆడిట్ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారన్నారు. పెన్షన్, రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ కార్డులను గ్రామ సచివాలయాల ద్వారా జనవరి నుంచి అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుందన్నారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 70 నుంచి 80శాతం పెన్షన్‌లు కోసం అర్జీలు స్పందనలో అందుతున్నాయన్నారు. ఇప్పటికే ఆరు లక్షల దరఖాస్తులు పెన్షన్‌లు కోసం అంది ఉన్నాయన్నారు. తమ శాఖ పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యలకు సంబంధించి పరిష్కార గడువును మరికొంత కుదించినట్లు చెప్పారు. ఈ సదస్సులో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం హరికృష్ణ, కృష్ణాజిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, నగర పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, డిఐజి టెక్నికల్ పాలరాజు, ఐఏఎస్ అధికారణి సాలోమి, ఏలూరు రేంజ్ డిఐజి ఏఎస్ ఖాన్, కృష్ణా జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాధ్‌బాబు, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గేవాల్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జేసి-2 కె మోహన్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ వి ప్రసన్న వెంకటేష్, సబ్ కలెక్టర్లు హెచ్‌ఎం ధ్యానచంద్ర, స్వప్నికల్ దినకర్ పునకర్, డీసీపీ విష్ణువర్ధన్‌రాజు, ఆర్డీఓ సత్యవాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

నగరాభివృద్ధిలో టౌన్ ప్లానింగ్ పాత్ర కీలకం
కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 8: నగర నిర్మాణం, అభివృద్ధిలో పట్టణ ప్రణాళిక విభాగం పాత్ర కీలకమని, అందరూ బాధ్యతగా తమ విధి నిర్వహణ చేసి ప్రజలకు మెరుగైన సేవలందిస్తే వారి మన్ననలు పొందవచ్చని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. ప్రపంచ పట్టణ ప్రణాళిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం వీఎంసీ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ నగర సమగ్ర అభివృద్ధికి, నగర క్రమబద్ధమైన నిర్మాణం అవసరమని, టౌన్ ప్లానింగ్ నియమ నిబంధనల అమలుతో నగరాన్ని ఒక క్రమబద్దంగా అభివృద్ధి చేయవచ్చన్నారు. సామాన్య ప్రజలు నిర్మించే సాధారణ భవనం నుంచి కార్పొరేట్ సంస్థలు నిర్మించే బహుళ అంతస్థుల భవనాల నిర్మాణాల వరకూ లయబద్ధంగా ఉంటే ఆ నగరం సుందరంగానే కాకుండా ఆకర్షనీయంగా ఉంటుందన్నారు. టౌన్ ప్లానింగ్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే ఉల్లంఘనలు ఉండవని తెలిపిన కమిషనర్ పట్టణ ప్రణాళికలో కీలకంగా ఉండే బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, బిల్డింగ్ ఆఫీసర్లు, ఆ పై అధికారులు అందరూ బాధ్యతగా తమ విధులను నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. సిటీ ప్లానర్ లక్ష్మణరావు మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక చట్టాల అమలులో అధికార, సిబ్బందికి ప్రజలు సహకరించే విధంగా వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించి ప్లానింగ్ చట్టాలను తూచా తప్పకుండా అమలుచేయాలని, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ప్లాన్ల వివరాలు, నియమ నిబంధనలను విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈకార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు సూపర్‌వైజర్లు, వార్డు ప్లానింగ్ రెగ్యులేటరి సెక్రటరీలు, లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా బందర్‌రోడ్డు ఇండోర్ స్టేడియం నుంచి వీఎంసీ కౌన్సిల్ హాల్ వరకూ టౌన్ ప్లానింగ్ అధికార, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.

తెలుగు భాషా పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమం
* పాఠశాల స్థాయిలో మాతృభాష కొనసాగించాలి
* రాష్ట్రంలో ఒకే విద్యావిధానం అమలు చేయాలి
* 17న తుమ్మలపల్లి దగ్గర నిరసన ప్రదర్శన
* అరసం రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 8: పాఠశాల స్థాయిలో తెలుగు మాద్యమానే్న కొనసాగించాలని, తెలుగు భాషా పరిరక్షణ కోసం సాహిత్య, సాంస్కృతిక సంఘాలు, విద్యార్థి, యువజనులు ఐక్యంగా ఉద్యమించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా విధానంపై అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా తెలుగు భాషకు అవరోధాలు ఎదురవుతున్నాయని చెప్పారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, తెలుగు దేశం పేరిట పార్టీలనూ ప్రవేశపెట్టారని వివరించారు. దేశవ్యాప్తంగా ఎంతో కీర్తి పొందిన తెలుగు భాషను బలహీనపరిచే చర్యల్లో భాగంగానే ఆంగ్ల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-8 తరగతులను ఆంగ్ల మాద్యమంలో బోధించేందుకు జీవో నంబరు-81 జారీ చేయడం దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాల్లోనూ ఒకే విద్యా విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలుగు భాషా పరిరక్షణ కోసం చర్యలు తీసుకోగా... కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాతృభాషా నిర్వీర్యానికి ప్రయత్నిస్తోందన్నారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల్లో భాగంగానే ఇంగ్లీషు భాషపై ప్రభుత్వం ఆసక్తి చూపుతుందని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. విరసం రాష్ట్ర నాయకులు సీఎస్‌ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషా-లిపి జాతికి ఒక చిహ్నంగా నిలిచాయని, ఈ భాషా పరిరక్షణ కోసం లోతైన చర్య కొనసాగాలని చెప్పారు. తెలుగు మాద్యమాన్ని తొలగిస్తే భాషా, లిపి ఉనికిని కోల్పోయే ప్రమాదముందన్నారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం తెలుగుతల్లి విగ్రహం వద్ద అరసం ఆధ్వర్యంలో అన్ని సాహిత్య సాంస్కృతిక సంఘాల ప్రతినిధులతో నిరసన ప్రదర్శన చేపట్టాలని, అనంతరం సీఎం జగన్మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేయాలని తీర్మానించారు. ఈ సమావేశంలో తెలుగుభాషోద్యమ సమాఖ్య నేత డాక్టర్ సామల రమేష్‌బాబు, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి వరప్రసాద్, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పి చంద్రనాయక్, అరసం జిల్లా కార్యదర్శి చలసాని వెంకట రామారావు, పీడీఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు ఎం రామకృష్ణ, ఏపీ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి చలపాక ప్రకాష్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు అక్కినేని వనజ, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, ఏఐటీయుసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అఫ్సర్, ప్రజా నాయకులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రికి ఘన స్వాగతం
ఇంద్రకీలాద్రి,నవంబర్ 8: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను శుక్రవారం కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ కార్యదర్శి బినోయ్ కుమార్ అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. రాజగోపురం వద్ద అర్చకులు ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వీరికి ఆశీర్వాద మండపంలో అర్చకులు దివ్య ఆశీస్సులను అందచేయగా ఈవో సురేష్‌బాబు దుర్గమ్మ చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలను అందచేశారు. ఈకార్యక్రమంలో సహాయ ఈవో రమేష్, ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కాబోయే సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని కలిసిన యార్లగడ్డ
లబ్బీపేట, నవంబర్ 8: భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా అతి త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డేను రాష్ట్ర అధికార భాషా సంఘం, ఏపీ హిందీ ఆకాడమీ అధ్యక్షుడు పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం డిల్లీలో జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డేతో భేటీ అయిన యార్లగడ్డ ఆయనకు తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథాలను బహుకరించారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో అటు అమరావతి, ఇటు విశాఖపట్నంను సందర్శించాలని ఈ సందర్భంగా కాబోయే ప్రధాన న్యాయమూర్తిని యార్లగడ్డ అభ్యర్థించారు. దానికి జస్టిస్ బాబ్డే సానుకూలంగా స్పందిస్తూ సమయానుకూలంగా వస్తానని హామీ ఇచ్చారు.

స్వయం సహాయక సంఘాల ఆర్ధిక బలోపేతం
కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 8: నగరంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులను ఆర్ధిక బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఊర్మిళనగర్ కమ్యూనిటీహాల్‌లో 320 గ్రూపు లీడర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం అమలులో ఉన్నందున, వాటికి ప్రత్యమ్నాయంగా జూట్, పేపర్, క్లాత్ బ్యాగ్‌లను తయారు చేసి వాటిని విక్రయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఇటువంటి చర్యలతో వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడి, ఆర్ధికంగా బలోపేతమవుతారన్న ఆయన ఈవిషయంపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈసందర్భంగా తమకు గత 3నెలలుగా జీతాలు చెల్లించలేదన్న రిసోర్స్ పర్సన్స్ విన్నపానికి స్పందించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తక్షణమే వారికి జీతాలను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యూసీడీ పీవో ఇన్‌చార్చి శామ్యూల్, మాజీ కార్పొరేటర్ బి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర నిరంకుశ పాలనకు నోట్ల రద్దే నిదర్శనం
ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు
* ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన శ్రేణులు
* అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదం, తోపులాటలు
* నినాదాలతో మార్మోగిన ఆంధ్రరత్న భవన్
* పోలీసుల అదుపులో పలువురు కార్యకర్తలు
* పోలీసు చర్యలను ఖండించిన పీసీసీ నేతలు
విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 8: ప్రజాస్వామ్య పరిపాలనలో నిరంకుశ పాలనకు కేంద్రం చేసిన నోట్ల రద్దే నిదర్శనమని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధుయాదవ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దు చేసి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం నగరంలోని పీసీసీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ వద్ద ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. నిరసనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోబోయిన పోలీసులు ఆంధ్రరత్న భవన్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా, పోలీసు చర్యలను నిరసిస్తూ కార్యకర్తలు తమ ఆందోళనను మరింత విస్తృతం చేయగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈనేపథ్యంలో ఇటు పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున తోపులాటులు, వాగ్వాదాలు చోటుచేసుకోగా, ఎట్టకేలకు దిష్టిబొమ్మ దగ్ధం కేసులో పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసు అరెస్టు చర్యలను పలువురు పీసీసీ నేతలు ఖండించారు. ఈసందర్భంగా ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు మాట్లాడుతూ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీపై పోరాటానికి మద్దతు పలకాల్సిన వైఎస్‌ఆర్‌సీపీ, ఇందుకు విరుద్ధంగా పోలీసులను తమ మీదకు ఉసిగొల్పి వేడుక చూస్తూ మోదీకి మోకరిల్లుతుండటం హేయమన్నారు. 2016 నవంబర్ 8వ తేదీన నోట్లరద్దు చేసిన రోజు చీకటిరోజుగా వర్ణిచిన ఆయన అధికారంలోకి రాకముందు నల్లధనాన్ని వెలికితీస్తానని ప్రగల్బలాలు పలికిన మోదీ అధికారంలోకి రాగానే నల్ల కుబేరుల కొమ్ముకాస్తున్నారని, నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ఎంతోమంది సామాన్య, మధ్య తరగతి ప్రజానీకం నరకం అనుభవించారన్నారు. నోట్ల రద్దుతో దేశాన్ని 20 ఏళ్ల వెనక్కి పంపారని, నిరుద్యోగం, దేశ ఆర్ధిక పరిస్థితి కుప్పకూలగా, నాటి దుర్బర పరిస్థితుల నుంచి నేటికీ తేరుకోని వైనం గమనార్హమన్నారు. ఈకార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి బి అనులేఖ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ శ్రేణులను అరెస్టు చేయడం దారుణం
ఏఐసీసీ కార్యదర్శి శైలజానాధ్
నోట్ల రద్దు చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంధ్రరత్న భవన్‌లో ఎన్‌ఎస్‌యుఐ చేపట్టిన ఆందోళనపై పోలీసులు అనుసరించిన తీరు హేయమని, కార్యకర్తలను, నేతలను అరెస్టు చేయడం అన్యాయమని ఏఐసీసీ కార్యదర్శి సాకే శైలజానాధ్ పేర్కొన్నారు. ఈసందర్భంగా శుక్రవారం ఆంధ్రరత్న భ