కృష్ణ

ప్రాథమిక విద్య మాతృ భాషలోనే సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: ప్రాథమిక విద్య మాతృ భాషలో జరగాలని ప్రపంచమంతా ఘోషిస్తుంటే మన రాష్ట్రం మాత్రం ప్రాథమిక విద్యలో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశ పెట్టి మాతృ భాష తెలుగు మాద్యమాన్ని పూర్తిగా తీసి వేయడం గర్హనీయమని శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. యునెస్కో, ప్రపంచ బ్యాంక్ నివేదికల వద్ద నుండి మన జాతీయ విద్యా విధానం కూడా మాతృ భాషలో ప్రాథమిక విద్య జరగాలని చెబుతున్నాయన్నారు. విద్యా కమిషన్లు, ప్రసిద్ధ విద్యావేత్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడం తెలుగు జాతిని ఎంతో బాధిస్తుందన్నారు. మన జాతి భాషా పూర్వకంగా ఏర్పడ్డ జాతి, ఎప్పుడు భాష నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తుందన్న విషయాన్ని గమనించాలన్నారు. ఒక జాతి జనుల సామాజిక జీవితం నుండి భాష సహజంగా పుట్టి పెరుగుతుందన్నారు. విద్యా విధానంలో కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ, పరిపాలనలో ఇంగ్లీష్‌ను కొనసాగిస్తూ ప్రజలు ఆంగ్ల మాధ్యమాన్ని కోరుతున్నారంటే అది ప్రభుత్వ విధానాల ఫలితమేనన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల చేతిలో విద్యా రంగాన్ని పెట్టి, వారు మాతృ భాషను బోధించకపోతే చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం చేష్టలుడిగి కూర్చుందని విమర్శించారు. నాణానికి రెండు వైపులా పరికించాలే గాని ఒక వైపు మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం సీఎం జగన్‌కు తగదన్నారు. తెలుగు విషయంలో గత ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగా వ్యవహరించాయన్నారు. ఫలితంగానే తెలుగు విద్యా రంగంలో గాని, పాలనా రంగంలో గాని ఆశించిన రీతిలో ముందుకు సాగలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గోరుచుట్టుపై రోకలి పోటు మాదిరి తయారైందన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి పట్టుదల, భేషజాలకు పోకుండా తెలుగుకు వెలుగునిచ్చేలా పునః సమీక్షించి తగు నిర్ణయం తీసుకోవాలని బుద్ధప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి
* సీఐ రవికుమార్
కోడూరు, నవంబర్ 11: కార్తీక పౌర్ణమి పర్వదినాన కృష్ణా సాగర సంగమ ప్రదేశమైన హంసలదీవి బీచ్ వద్ద పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా చూడాలని అవనిగడ్డ సీఐ బిబి రవి కుమార్ సూచించారు. సోమవారం బీచ్‌లో బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందికి, గ్రామ సచివాలయ సిబ్బందికి, గ్రామ వలంటీర్లకు కోడూరు పోలీసు స్టేషన్ ప్రాంగణంలో యాత్రీకుల భద్రత కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు. సాగర సంగమ ప్రాంతంలో భక్తులు పుణ్య స్నానాల కోసం లోతుకు వెళ్లకుండా జల్లు స్నానాలు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. సోమవారం పొద్దుపోయే వరకు సీఐ బీచ్ వద్దే ఉండి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రమేష్, తహశీల్దార్ లతీఫ్ పాషా, ఇఓపీఆర్‌డీ యలవర్తి రామ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమివ్వాలి
* డీఆర్‌ఓ ప్రసాద్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 11: ప్రజా సమస్య పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్పందనలో వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ స్పందనపై ఎంతో నమ్మకంతో ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తున్నారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ముడా వీసీ విల్సన్‌బాబు, ఆర్డీవో ఎన్‌ఎస్‌కె ఖాజావలి, డీఆర్‌డీఎ పీడీ శ్రీనివాసరావు, జడ్పీ సీఇఓ సూర్యప్రకాశరావు, నగర పాలక సంస్థ కమిషనర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.