కృష్ణ

డిసెంబర్ నుంచి వైద్యశాలలకు నాడు - నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట : రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సారథ్యంలో వైద్యం, విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, వచ్చే నెల నుంచి వైద్యశాలల అభివృద్ధే ధ్యేయంగా నాడు నేడు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో రాకీమ్‌పార్మ కోటి రూపాయలతో నిర్మించిన కిడ్ని డయాలసిస్ సెంటర్‌ను జవహర్‌రెడ్డి నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉన్న 178 ప్రభుత్వ వైద్యశాలల అభివృద్ధికి 1500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ నిధులతో వైద్యశాలల అభివృద్ధి, భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. వైద్యశాలల్లో సిబ్బంది భర్తీకి జనవరిలో వైద్యులకు నోటిఫికేషన్ రానున్నదని, నియోజకవర్గ కేంద్రంలోని వైద్యశాలకు 108 వాహనం, 24 సేవలు అందించేలా వైద్యులు అందుబాటులోకి రానున్నారని అన్నారు. వైఎస్‌ఆర్ కంటి వెలుగు ఉత్తమ ఫలితాలు ఇస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని పౌరులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్‌కార్డులు అందించాలనే యోచన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ వైద్యశాలలకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు అందించడమే లక్ష్యంగా నిధులు కేటాయిస్తోందని వైద్యశాలల్లో నాడు, నేడు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
పేట వైద్యశాలకు నిధులు కేటాయించండి
జగ్గయ్యపేట వైద్యశాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను కోరారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ 30 పడకల వైద్యశాలకు 50కు పెంచాలని, వైద్యులతో సహా సిబ్బందిని భర్తీ చేయాలని, పెనుగ్రంచిప్రోలు, వత్సవాయి పిహెచ్‌సీల స్థాయి పెంచాలని, రామిరెడ్డిపల్లిలో నూతనంగా పిహెచ్‌సీ ఏర్పాటు చేయాలని వినతిపత్రాలను అందించారు. వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసిన రాకీమ్‌ఫార్మ నేతలు శిరీష్‌కుమార్ తదితరులను వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలు కర్మాగారాలకు చెందిన నేతలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.