కృష్ణ

మద్దతు ధర విషయమై ఆందోళన వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం మద్దతు ధర విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర మేరకే ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయన్నారు. కొనుగోళ్లకు సంబంధించి జిల్లాలో 264 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘ఎ’ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.1835లు ధర నిర్ణయించగా కామన్ రకానికి రూ.1815లు ధర నిర్ణయించినట్టు తెలిపారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు నేరుగా తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చి విక్రయించాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఈ విడత మరింత సులభతరం చేశామన్నారు. రైస్ మిల్లర్లు కూడా ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల్ని ఇబ్బందులు పెట్టవద్దని జేసీ మాధవీలత విజ్ఞప్తి చేశారు.

చిరస్మరణీయులు అయ్యంకి, గాడిచెర్ల
- జేసీ-2 మోహనరావు
మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 14: గ్రంథాలయోధ్యమ పితామహులు అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరి సర్వోత్తమరావు చిరస్మరణీయులని జిల్లా జాయింట్ కలెక్టర్ -2 కె మోహనరావు అన్నారు. స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జెసీ-2 మోహనరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎంవిడిటి నగేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జేసీ-2జాయింట్ కలెక్టర్ కె మోహన్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర సముపార్జన సమయంలో ప్రజలను చైతన్యపర్చడానికి అయ్యంకి, గాడిచర్ల గ్రంథాలయోద్యమం ద్వారా చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ డా. అంబేద్కర్ లాంటి మహనీయులు గ్రంథాలయాలను ఉపయోగించుకుని ఉన్నత స్థితికి ఎదిగారన్నారు. కోటి 80 లక్షల పుస్తకాలతో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. బి ధన్వంతరి ఆచార్య, భవిష్య, పాలంకి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.