కృష్ణ

మోడల్ స్టేడియంగా ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: క్రీడలను ప్రోత్సహిస్తూ భావితరాలకు ఒక మోడల్ స్టేడియంగా ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణాన్ని తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ చెప్పారు. మంగళవారం స్థానిక స్టేడియం కమిటీ హాల్లో జరిగిన సర్వసభ్య సమావేశానికి చైర్మన్ హోదాలో ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ సమీక్షిస్తూ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించిన స్టేడియం నిర్వహణ ఖర్చులను ఆమోదించామన్నారు. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి క్రీడల నిర్వహణకు రూ.27.50లక్షల బడ్జెట్‌ను కేటాయించామన్నారు. పెండింగ్‌లో ఉన్న పలు కోర్టు కేసులపై సభ్యులతో చర్చించారు. స్టేడియం కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత రావి శోభనాద్రిచౌదరి కాంస్య విగ్రహం ఏర్పాటుకు సభ్యుల ఆమోదం లేకపోవడంతో ఈ అంశాన్ని తర్వాతి సమావేశానికి వాయిదా వేశామన్నారు. కమిటీ జీవితకాల సభ్యులు పోలవరపు సుబ్రహ్మణ్యేశ్వరరావు, రావి శోభనాద్రిచౌదరి, బొప్పన బాపినీడుప్రసాద్, పిన్నమనేని రాజారావు, మున్నలూరి మాణిక్యాలరావులు మరణించారని, బైలా ప్రకారం వీరి వారసులను సభ్యులుగా ఒక తరం కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. స్టేడియం ఆవరణలో ఉన్న రైతుబజార్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీన్ని కఠారి సుబ్బయ్య మార్కెట్‌కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు పలువురు సభ్యులు వివరించారు. దీనిపై సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. స్టేడియంలో 320అడుగుల మేర రూఫింగ్ నిర్మాణం, దీనిపై సోలార్ పలకల ఏర్పాటుకు సభ్యులు ప్రతిపాదనలు చేశారు. స్టేడియానికి నాలుగువైపులా ఆర్చ్‌లను నిర్మించాలని, పాత పద్ధతిలోనే కమిటీకి చెక్‌పవర్ ఇవ్వాలని, స్టేడియానికి తూర్పు, పడమర వైపు రెండు గజాల మేర స్థల ఆవరణను పెంచాలని సభ్యులు ప్రతిపాదించారు. కమిటీ ఉపాధ్యక్షుడు పిన్నమనేని సాంబశివరావు మాట్లాడుతూ స్టేడియానికి ప్రతినెలా రూ.6.67లక్షల ఆదాయం వస్తోందని, దీనిలో రూ.3.50లక్షలు ఉద్యోగుల జీతభత్యాలకు, రూ.1.10లక్షలు మున్సిపల్ పన్నులు, రూ.70వేలు విద్యుత్‌కు, రూ.50వేలు మెయింటినెన్స్‌కు ఖర్చు చేస్తున్నామన్నారు. బ్యాంక్ డిపాజిట్‌లుగా ఉన్న రూ.3.90కోట్లపై వచ్చే వడ్డీని క్రీడల అభివృద్ధికి వినియోగిస్తున్నామన్నారు. ముందుగా స్టేడియంలో వివిధ హోదాల్లో పనిచేసి మరణించిన కమిటీ సభ్యుల ఆత్మశాంతికి 2నిమిషాల పాటు వౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డీవో జీవీ సత్యవాణి, డీఎస్పీ ఎన్ సత్యానందం, తహశీల్దార్ ఆర్ పాపమ్మ, కమిటీ సంయుక్త కార్యదర్శి నర్రా రత్నశేఖర్, సభ్యులు డాక్టర్ పొట్లూరి గంగాధరరావు, లంకదాసరి ప్రసాదరావు, పర్వతనేని ఆనంద్, బాబూశ్రీకర్, గుండిమడ రాఘవేంద్రరావు, ప్రవీణ్ జైన్, చింతా రఘుబాబు, అడుసుమిల్లి శ్రీనివాస్, నెరుసు శేషగిరిరావు, మాగంటి వీరభద్రరావు, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెళ్ళ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.