కృష్ణ

గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన: గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు జోగి రమేష్ అన్నారు. గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పెడన బ్రాంచ్‌లో రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంధాలయంలో పుస్తకాలను పరిశీలించారు. విద్యార్థులకు ఉపయోగపడే పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రంధాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా రౌతుల ప్రసాద్‌ను ఆయన ప్రకటించారు. రంగవల్లుల పోటీల్లో పాల్గొన్న మహిళలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనంద ప్రసాద్, పట్టణ వైసీపీ అధ్యక్షుడు బండారు మల్లి, మాజీ వైస్ చైర్మన్ కమాల్, అయూబ్ ఖాన్, వనె్నం శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం
కూచిపూడి, నవంబర్ 19: ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని మొవ్వ ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఏపీఎం కె సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీడీఓ వి ఆనందరావు మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు తమ గృహాలతో పాటు పరిసర ప్రజలను కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించుకునే విధంగా చైతన్యపర్చాలన్నారు. బహిరంగ మల విసర్జనను అరికట్టేందుకు డ్వాక్రా మహిళలు ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యం నిర్వహణ, మరుగుదొడ్ల వల్ల కలిగే లాభాలను ఎంపీడీఓ ఆనందరావు, ఎపీఎం కె సుబ్బారావు, పీహెచ్‌సీ వైద్యులు డా. శొంఠి శివరామకృష్ణ వివరించారు.