కృష్ణ

రాష్ట్రంలో అవినీతి పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, జూన్ 23: రాష్ట్ర ప్రభుత్వం సర్వత్రా అవినీతిమయమైందని, ఎవరైనా విమర్శిస్తే పోలీసులను ప్రయోగించటం, అక్రమ కేసులు నమోదు చేయటం జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. గురువారం ఆయన స్థానిక వైకాపా కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ కాంట్రాక్టర్లు నిబంధనలకు వ్యతిరేకంగా ముడుపులు తీసుకునేందుకు మాత్రమే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులు రూ.5కోట్లతో చేపట్టి రైతులకు ఉపయోగం లేని, కాంట్రాక్టర్లకు ఉపయోగపడేలా చేస్తోందన్నారు. పంట కాలువలను వెడల్పు చేయటమేకాక లైనింగ్ మాత్రమే వేస్తున్నారని, దీనివల్ల రైతులకు మేలు జరగదని రాంబాబు స్పష్టం చేశారు. కేవలం వర్షపు నీటిని కృష్ణానదిలో అనుసంధానం చేసి గోదావరి జలాలు అనుసంధానం అంటూ ప్రజలను మభ్యపెట్టారని, రాజధాని నిర్మాణంలో, పట్టిసీమ నిర్మాణంలో వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని రాంబాబు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఒక గూండా పార్టీగా తయారైందన్నారు. ఈనేపథ్యంలో ప్రజలు తిరుగుబాటు చేయటం ద్వారా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్నారు. ఈ రెండేళ్ల పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదని, హామీలు మాత్రం ఇచ్చారన్నారు. అలాగే సదావర్తి భూముల వేలంలో అక్రమాలకు పాల్పడటం ద్వారా రూ.7కోట్ల విలువైన భూములను రూ.27 లక్షలకే చంద్రబాబు ఆయన కుమారుడు బినామీ పేర్లతో పొందారని ఆరోపించారు. కాపు నేత ముద్రగడ పద్మనాభంను అరెస్టు చేయటం ద్వారా చంద్రబాబు సాధించింది ఏమీలేదన్నారు. 13 మందిని జైలు నుంచి విడిపించటం ద్వారా ముద్రగడ విజయం సాధించారని రాంబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సింహాద్రి రమేష్ బాబు, ఆర్ శ్రీనివాసరావు, కె నరసింహారావు పాల్గొన్నారు.