కృష్ణ

దివిసీమ ఉప్పెన బాధితులకు నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు మంగళవారం పలు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఆధ్వర్యంలో గాంధీ క్షేత్రంలో ఇందిరా గాంధీ విగ్రహానికి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దివిసీమ ఉప్పెన, తుఫాన్ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ 1977 ఉప్పెన, తుఫాన్ సమయంలో దేశంలోని ప్రజలందరూ మానవత్వాన్ని చాటుకుని దివిసీమ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. నిస్వార్ధంగా అనేక స్వచ్ఛంద సంస్థలు దివిసీమకు రావటం ద్వారా పలు గ్రామాల నిర్మాణం జరిగిందన్నారు. రామకృష్ణ మిషన్, ఆర్‌ఎస్‌ఎస్, పోలీసు శాఖ గ్రామాలను దత్తత తీసుకుని పునః నిర్మాణం చేశాయని గుర్తు చేశారు. ఉప్పెన సమయంలో దాదాపు 10వేల మంది మృత్యువాత పడగా అనేక స్వచ్ఛంద సంస్థలు స్వయంగా శవ దహనాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కె వెంకటేశ్వరరావు, గ్రామీణ వికాస సమితి అధ్యక్షుడు మండలి రాజా, మత్తి శ్రీనివాసరావు, గాజుల మురళీకృష్ణ, జనార్ధనరావు, విష్ణుప్రసాద్, రేపల్లె వీరరాఘవయ్య, కె మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరమ్మ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు దిడ్ల వీరరాఘవులు, ఆది రామ్మోహనరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పైపులైను వెళ్లే పోలాలకు పూర్తి పరిహారం ఇవ్వాలి

చందర్లపాడు, నవంబర్ 19: విజయవాడ -్ధర్మపురి వెళ్లే హెచ్‌పీసీఎల్ పైపులైను బాధితులు తమకు 100 శాతం నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ బాధితులందరూ స్థానిక అలివేలమ్మ గుడి వద్ద సమావేశం నిర్వహించారు. మంగళవారం సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి ఆంజనేయులు హాజరై మాట్లాడుతూ హెచ్‌పీసీఎల్ పైపులైను జిల్లాలో 5 మండలాల నుండి వెళుతుందని పైపులైను వెళ్లటం వలన భూమి విలువ పూర్తిగా పడిపోతుందని తెలిపారు. 1965 చట్ట ప్రకారం కాకుండా 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి పూర్తి నష్టపరిహారం చెల్లించి పనులు ప్రారంభించాలని తెలిపారు. దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన హెచ్‌పీసీఎల్ 18 మిలియన్ టన్నుల సామర్థ్యంతో 3 లక్షల కోట్ల టర్నోవర్‌తో 15,127 ఆయిల్ రిటైల్ అవుట్ లెట్‌లతో లాభాలు గడిస్తుందని అన్నారు. గత సంవత్సరం 11,448కోట్ల లాభాలు వచ్చాయని రైతులకు మాత్రం ఉన్న ధరలో 10శాతం మాత్రమే నష్టపరిహారం ఇస్తామని అనటం సబబు కాదని అన్నారు. రైతులు మాట్లాడుతూ పైపులైన్ అవసరాల కోసం ఎకరం 36 లక్షల వరకు కొనుగోలు చేయటం జరిగిందని దాని ప్రకారం పైపులైను వెళ్లే పొలాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం సాధించుకొనే వరకూ రైతులందరూ సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి ఎన్ నరసింహ, రైతు సంఘం నాయకులు మనె్నం శ్రీనివాసరావు, కమతం పుల్లారావు, గుదె నరసింహారావు, మల్లెల వెంకటేశ్వర్లు, తొండపు వౌళేస్వరరావు, ములకలపల్లి దేశియ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.