కృష్ణ

అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్: రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక అక్రమంగా తరలించిన, డంపింగ్‌యార్డులను తయారు చేసి నిల్వలు ఉంచిన కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని నందిగామ డీఎస్‌పి రమణమూర్తి హెచ్చరించారు. మంగళవారం తెల్లవారుజామున మండలంలోని షేర్‌మహ్మద్‌పేట గ్రామ శివారులోని రామచంద్రం పేట డొంకరోడ్డులో అక్రమ ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈసందర్భంగా చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించి దానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. చిల్లకల్లు పోలీసులకు అందిన సమాచారంతో ఎస్‌ఐ అభిమన్యు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా రామచంద్రం పేట డొంకరోడ్డులో ఇసుకలోడుతో ఉన్న లారీ, లోడు చేస్తున్న జేసీబీలు గుర్తించి పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి లారీ డ్రైవర్ గంగుల వెంకటేశ్వరరావు, జేసీబీ ఆపరేటర్ జడా హరికృష్ణ, లారీ, జేసీబీ యజమానులు కృష్ణ, వెంకటేశ్వరరావు, పసుపులేటి శ్రీనివాసరావులను అరెస్టు చేయటం జరిగిందని, ఆ ప్రదేశంలో ఇసుకను డంప్ చేసిన ఆకుల ప్రసాద్ అనే అతను పరారీలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై జిల్లా సరిహద్దు గరికపాడుతో పాటు ముక్త్యాల వద్ద ప్రత్యేకంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ సిబ్బంది 24 గంటలు విధులు నిర్వర్తిస్తారన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారు ఎంతటి వారైనా, ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డీఎస్‌పీతో పాటు జగ్గయ్యపేట సీఐ నాగేంద్రబాబు, చిల్లకల్లు ఎస్‌ఐ అభిమన్యు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.