కృష్ణ

అందరికీ అందుబాటులోకి ఇసుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: ఇసుక నూతన విధానం ప్రవేశ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఈజీగా ఇసుక లభ్యమయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. మండలంలోని రొయ్యూరులో ప్రైవేటు క్వారీని మంగళవారం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, సబ్‌కలెక్టర్ ధ్యానచంద్ర కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం కలెక్టర్ రిబ్బన్ కత్తిరించి క్వారీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇసుక లభ్యత పెంచే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ క్వారీలు, ప్రైవేటు ల్యాండ్‌లోని ఇసుకను, వాగులు, వంకలు, చిన చిన్న నదుల్లో ఇసుకను తీసేందుకు ప్రభుత్వం తరపు నుంచి చర్యలు చేపట్టాగా, దానిని ఎపీఏండీసీ సరఫరా చేస్తుందని తెలిపారు. రొయ్యూరు క్వారీలో 20 ఎకరాలు పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఇసుక వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు రొయ్యూరులో ప్రారంభించామని తెలిపారు. ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అవసరమైన ప్రజలందరికీ చిత్తశుద్దితో ఇసుక అందించాలని పనిచేస్తోందని తెలిపారు. వివిధ రంగాల కార్మికులు ఇసుకపై ఆధార పడి ఉన్నారని తెలిపారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల ఇసుక అందుబాటులోకి రావటం కొంత ఆలస్యం అయ్యిందని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధి పనిచేస్తోందని, త్వరలోనే ఇసుక కొరత తీరిపోతుందని తెలిపారు. ఏక్కడైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తు పట్టుబడితే రూ.2లక్షలు జరిమానా, రెండేళ్ళు జైలు శిక్ష అని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారని చెప్పారు. లోకల్ కార్మికులకు కూడా పని కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కోరామని, వారు సానుకులంగా స్పందించి, పరిశీలించి చెపుతామన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కట్టా వెంకట శివయ్య, ఎంపీడీఓ టి స్వర్ణలత, మాజీ ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, మాజీ జడ్పీటీసీ మోర్ల రామచంద్రరావు, మోర్ల పూర్ణ ,పలువురు శాఖల అధికారులు పాల్గొన్నారు.