కృష్ణ

ప్రతిపాదిత నివేశన స్థలాల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: నివేశన స్థలాల పంపిణీ కోసం సొసైటీ భూములను జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌బాబుతో కలిసి బుధవారం పరిశీలించారు. అవనిగడ్డ శివారు వసిమెట్ల సమీపంలో సర్వే నెం.5, 6, 9, 10, 11లలో గల 52.40 ఎకరాల్లో ఉన్న భూమిని సొసైటీ కింద 70 సంవత్సరాలుగా సీతాయిలంకకు చెందిన దళితులు 107 మంది సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేపట్టిన మొదలు రాష్ట్రంలోని 25లక్షల మంది పేదలకు ఉగాది నాటికి నివేశన స్థలాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. దీంతో స్పందన కార్యక్రమంలో నివేశన స్థలాలు కోరుతూ భారీగా అర్జీలు వచ్చాయి. మండలంలో ఏ గ్రామంలోనైనా ఎకరా భూమి రూ.60లక్షలు నుండి రూ.2కోట్ల వరకు విక్రయాలు జరుగుతుండటంతో నివేశన స్థలాలు కోసం బుధవారం 46.40 ఎకరాల సొసైటీ భూమిని జేసీ మాధవీలత పరిశీలించారు. కృష్ణానదికి కేవలం 40 మీటర్ల పరిధిలోనే సొసైటీ భూమి ఉండటంతో ఈ భూమి నివేశన స్థలాలకు పనికిరాదు. సొసైటీ సభ్యులు పొట్ట కొట్టవద్దంటూ సొసైటీ సభ్యులు జేసీ మాధవీలత, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబును కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కె నరసింహారావు, ఆర్డీఓ ఖాజావలీ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

పొలంబడిపై వ్యవసాయ అధికారులకు శిక్షణ
పెనమలూరు, నవంబర్ 20: మండలంలోని చోడవరం పొలాల్లో జిల్లాలోని 50 మండలాల వ్యవసాయ శాఖ అధికారులకు, 16 డివిజన్ల వ్యవసాయ సహాయ సంచాలకులకు పొలంబడి కార్యక్రమంపై బుధవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ టీ మోహన్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని పొలం నిర్వహణ పద్ధతులు వివరించారు. గుంటూరు వ్యవసాయ కమిషనరేట్ పరిధిలోని జాయింట్ డైరెక్టర్ పద్మజ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులకు పొలంబడి నిర్వహణపై సూచనలు చేశారు. రైతు శిక్షణ కేంద్రంలో వ్యవసాయ సహాయ సంచాలకులు (శిక్షణ)గా పనిచేస్తున్న పార్థసారథి క్షేత్రస్థాయిలో పురుగులు, తెగుళ్లను గుర్తించే విధానం గురించి విపులంగా వివరించారు. కార్యక్రమంలో 50 మండలాల ఏవోలు, 16 వ్యవసాయ డివిజన్ల ఏడీఏలు పాల్గొన్నారు.