కృష్ణ

నిత్యం ప్రజల మధ్య మంత్రి ‘పేర్ని’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు) : రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు. తన నివాసానే్న కార్యాలయంగా ఏర్పర్చుకున్న మంత్రి పేర్ని నాని ప్రతి రోజూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సాదక బాధకాలు వింటున్నారు. తన పరిధిలో లేని సమస్యలను కూడా సంబంధిత మంత్రుల ద్వారా పరిష్కరిస్తున్నారు. బుధవారం మంత్రి నాని తన కార్యాలయానికి వచ్చిన అనేక మంది నియోజకవర్గ ప్రజల సమస్యలను ఒప్పిగ్గా విని వారి సమస్యలను పరిష్కరించాలని ఫోన్ ద్వారా అధికారులకు సూచించారు. గూడూరు మండలం తరకటూరు సమ్మర్ స్టోరేజి ట్యాంక్ దగ్గర రామరాజుపాలెం ఛానల్ గండి పూడిపించాలని గ్రామస్థులు మంత్రిని కోరగా అక్కడ స్లూయిస్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేశారు. స్థానిక 7వ వార్డు లక్ష్మణరావుపురంలో గత 40 సంవత్సరాలు పై బడి కలెక్టర్ బంగ్లా వెనుక నివశిస్తున్నామని ఆ స్థలాలకు ఇంటి పన్ను, కరెంటు బిల్లు అన్ని సక్రమంగా కడుతున్నామని, ఇళ్ల పట్టాలు ఇప్పించాలని పలువురు గ్రామస్థులు మంత్రిని కోరారు. విజయవాడ రూరల్ ఎనికేపాడు గ్రామానికి చెందిన కొమరవల్లి మురళీధర్ తన తండ్రి పుప్పారావు ఆర్టీసీలో కండక్టరుగా పని చేస్తూ అనారోగ్యంతో 2016లో మెడికల్ అన్‌ఫిట్ అయ్యారని, బ్రడ్ విన్నర్స్ స్కీమ్ కింద ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ మంత్రికి అర్జీ అందచేశారు. మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారికి తరకటూరు పంచాయతీ శివారు తరకటూరుపాలెం, పర్ణశాల గ్రామాల జాతీయ రహదారికి తరకటూరు పంచాయతీ శివారు తరకటూరుపాలెం, పర్ణశాల గ్రామాల జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్నాయని ప్రజల సౌకర్యార్ధం డివైడర్ క్రాసింగ్ ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్థులు మంత్రికి విన్నవించుకున్నారు. తరకటూరుపాలెం పర్ణశాల గ్రామ పరిధిలో మంచినీటి ఆర్ డబ్ల్యుఎస్ వాటర్ ట్యాంకు దగ్గర జంగిల్ క్లియరెన్స్ చేయించాలని మంత్రి పేర్ని నానిని గ్రామస్థులు కోరారు.

అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యం
కలిదిండి, నవంబర్ 20: గత ప్రభుత్వంలో చేయలేని పథకాల విధానాలను ఒక్క జగన్మోహనరెడ్డికే సాధ్యమైందని ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కోటగిరి శ్రీ్ధర్, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మండలంలోని విబ్బారామపురం నుండి ఏలూరుపాడు వరకు రూ.4కోట్ల 30లక్షలు, పోతుమర్రు పంచాయతీ నుండి సున్నంపూడి వరకు రూ.3కోట్ల 74లక్షలు, పోతుమర్రు నుండి దుంపలకోడుదిబ్బ వరకు రూ.కోటి 50లక్షలు మొత్తం రూ.9.59కోట్లతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశం మేరకు 100 రోజుల్లో నవరత్నాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ వలంటీర్లలో 70శాతం మహిళలే ఉన్నారన్నారు. 40 యేళ్ల రాజకీయ అనుభవం ఉందని రాజకీయ వృద్ధుడు మా వ్యవస్థ గురించి తప్పుడుగా మాట్లాడటం కడు శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా అధ్యక్షుడు నీలపాల వెంకటేశ్వరరావు, తహశీల్దార్ స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.