కృష్ణ

బాల్యాన్ని హరించే వారిపై చట్టపరమైన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఎంతో విలువైన బాల్యాన్ని హరించే హక్కు ఎవరికీ లేదని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. బాలల హక్కులను కాలరాసే వారు తల్లిదండ్రులైనా సరే శిక్షార్హులేనని గుర్తు పెట్టుకోవాలన్నారు. బుధవారం రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా చదువుకు దూరమైన దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న 334 మంది వీధి బాలలను గుర్తించారు. వీరందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తామని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం ఎంతో విలువైనదన్నారు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యా వ్యవస్థకు దూరం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అన్ని వౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇవ్వటంతో పాటు మధ్యాహ్న భోజనం, ఏక రూప దుస్తులు అన్నింటినీ ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కింద సంవత్సరానికి రూ.15వేలు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఇన్ని వసతులు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను బాల కార్మిక వ్యవస్థ వైపు పంపిస్తుండటం బాధాకరమన్నారు. ప్రతి వీధి బాల బాలికలు బడుల్లో ఉండాలన్న లక్ష్యంతో ప్రతి నెలా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్‌లో గుర్తించిన ప్రతి చిన్నారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించటంతో పాటు తల్లిదండ్రులు లేని వారిని చైల్డ్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో ఉంచి చదివిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, ఎఆర్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు చంద్రశేఖర్, మోర్ల వెంకట నారాయణ, అఖిల్ జమ, శ్రీనివాస్, ఆర్‌ఐ వెంకట్రావ్, తహశీల్దార్ సునీల్ బాబు, ఎంఇఓ ప్రసాద్, శిశు సంక్షేమాధికారి నాగలక్ష్మి, కాసా స్వచ్చంద సంస్థ చైర్మన్ యేసుపాదం తదితరులు పాల్గొన్నారు.

ప్రమాద బీమా సొమ్ము అందజేత
మచిలీపట్నం (కోనేరుసెంటరు), నవంబర్ 20: పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్ల వేళలా అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు అన్నారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో కానిస్టేబుల్ జి రాజగోపాల్‌కు మంజూరైన యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఫండ్ రూ.5లక్షల రూపాయల చెక్కును రాజగోపాల్ భార్య శ్రీలతకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ మీ కుటుంబానికి అండగా ఉంటుందని, ఏ సమస్య వచ్చినా వెంటనే సంప్రదించవచ్చని, శాఖాపరంగా రావల్సిన ఇతర ప్రయోజనాలను త్వరలోనే అందిచేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజగోపాల్ తల్లి నాగేంద్రమ్మ, జూనియర్ అసిస్టెంట్ మున్వర్ పాల్గొన్నారు.