కృష్ణ

మొక్కజొన్న కొనుగోళ్లకు ఏర్పాట్లు షురూ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సహకార సంఘాలు, డీసీఎంఎస్ ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లను ఈ నెల 25వతేదీ నుండి ప్రారంభించనున్నట్లు ఏపీ మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్వింటాలు మొక్కజొన్నకు రూ.1760లు మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పశ్చిమ కృష్ణాలోని చాట్రాయి, వీరుళ్లపాడు, మైలవరం, నందిగామ, కంచికచర్ల మండలాల్లోని సహకార సంఘాలు, డీసీఎంఎస్ ద్వారా మొక్కజొన్న దిగుబడులను కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. మద్దతు ధరకై రైతులు తమ పంటను ఈ-క్రాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవల్సి ఉంటుందన్నారు. పంటను బాగా అరబెట్టి శుభ్రపర్చుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. తడిసిన, పురుగు పట్టిన, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేని పంటను కొనుగోలు చేయడం జరగదన్నారు. రైతులు ముందుగా శాంపిల్స్‌ను కొనుగోలు కేంద్రాల్లోని అధికారులకు చూపించి కూపన్ తీసుకోవాలన్నారు. కూపన్‌లో పేర్కొన్న తేదీ రోజున తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావల్సి ఉంటుందని తెలిపారు. రైతులు తప్పనిసరిగా తమ పట్టాదార్ పాస్ పుస్తకం నకలు, బ్యాంక్ పాస్ బుక్ నకలు, ఆధార్ కార్డు నకలు, సాగు ధృవీకరణ పత్రం తీసుకురావాలన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన మద్దతు సొమ్మును నేరుగా రైతు బ్యాంక్ ఎకౌంట్లలోకి ఏడు పని దినాలలో లోపు జమ చేయడం జరుగుతుందని జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు.