కృష్ణ

కొత్త ఏడాది కొత్త క్యాంపస్‌లో టోర్నీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): కృష్ణా విశ్వ విద్యాలయం ద్వారా నిర్వహించనున్న అన్ని రకాల క్రీడా పోటీలను రానున్న కొత్త సంవత్సరంలో నూతన క్యాంపస్‌లో నిర్వహిస్తామని ఉపకులపతి ఆచార్య వైకె సుందరకృష్ణ తెలిపారు. స్థానిక ఆంధ్ర జాతీయ కళాశాలలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న విశ్వ విద్యాలయం అంతర్ కళాశాలల ఫుట్‌బాల్ టోర్నమెంట్ పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ టోర్నమెంట్‌లో విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల జట్టు విన్నర్‌గా నిలవగా ఆంధ్ర లయోల కళాశాల జట్టు రన్నర్‌గా నిలిచింది. ఉపకులపతి సుందరకృష్ణ చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సుందరకృష్ణ మాట్లాడుతూ కృష్ణా విశ్వ విద్యాలయం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ఎనిమిది జోనల్ స్థాయి టోర్నమెంట్లను నిర్వహించడమే గాక 49 క్రీడలలో పలు జట్లను పోటీలకు పంపించడం జరిగిందన్నారు. విశ్వ విద్యాలయం ఫిజికల్ ట్రైనర్ రామకృష్ణ పరమహంస అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. జానీ కమల్లేష్, శాప్ ఫుట్‌బాల్ కోచ్ పి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.