కృష్ణ

వైభవోపేతంగా మహాక్షేత్రం బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు: మండల పరిధిలోని డోకిపర్రు గ్రామంలో వేంచేసియున్న శ్రీ, భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం (మహాక్షేత్రం) వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి-సుధ దంపతుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సూచికగా ఆలయంలోని ఉత్సవ మూర్తులకు వేద పండితులు విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్నపన, తిరుమంజనం, సేనాధిపతి ఉత్సవం, అంకురారోపణ, వాహనం (తిరుచ్చి), పల్లకి సేవ తదితర కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్శహించారు. గ్రామ మాజీ సర్పంచ్, ఆలయ నిర్వాహకులు పురిటిపాటి వీరారెడ్డి-విజయలక్ష్మి దంపతులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజాదికాలు నిర్వహించారు. తిరుమల మాదిరిగా త్రైయహానిక దీక్షతో దివ్యశ్రీ వైఖానస భగవచాస్త్ర మార్గానుసారంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు వేద పండితులు తెలిపారు. సాయంత్రం మహాక్షేత్రానికి అనుబంధంగా ఉన్న వరసిద్ధి వినాయక దేవాలయానికి విఖనసాచార్యులు, విష్వక్‌సేనుల ఆధ్వర్యంలో వెళ్లి భూదేవిని ప్రార్థించి పుట్టమన్ను తెచ్చి పాలతో తడిపిన నవధాన్యాలతో 12 మూకుళ్లలో పుట్టమన్ను, నవధాన్యాలు వేసి ప్రార్థించి అంకురారోపణ చేశారు. రెండవ రోజైన శుక్రవారం ధ్వజారోహణం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

చదువే జీవిత లక్ష్యం కావాలి - మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 21: చదువే జీవిత లక్ష్యం కావాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విద్యార్థులకు ఉద్బోధించారు. మండల పరిధిలోని తాళ్లపాలెం జడ్పీ హైస్కూలులో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ కింద మంజూరైన రూ.58.56లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను గురువారం మంత్రి పేర్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల్లో అవసరమైన 10 ఫ్యాన్‌లను ఏర్పాటు చేయిస్తానని, పాత తరగతి గదుల్లో నడుస్తున్న 6, 7 తరగతుల విద్యార్థులను కొత్త భవనంలోకి మార్చాలని సూచించారు. నాడు-నేడు పథకం కింద రాష్ట్రంలో పాఠశాలల ప్రస్తుత పరిస్థితుల నుండి అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కానె్వంట్ చదువులు పేద వాడికి భారమైన నేపథ్యంలో ఒకటి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ డ్రాపౌట్స్ లేకుండా విద్యార్థులందరూ బడికి వస్తే మీ తల్లికి ప్రతి ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయాన్ని అమ్మ ఒడి ద్వారా ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్, మాజీ కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ శ్రీకాకుళపు నాగేశ్వరరావు, గ్రామ మాజీ సర్పంచ్ వాలిశెట్టి రవిశంకర్, డీవైఇఓ సత్యనారాయణమూర్తి, మెప్మా పీడీ జివి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.