కృష్ణ

జిల్లాలో ఇసుక కొరత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: జిల్లాలో ఇసుకకు కొరత లేదని జిల్లా కలెక్టర్ ఎమహ్మద్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇసుక డంపింగ్‌నుండి అమ్మకాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 25వేల టన్నుల ఇసుక నిల్వలున్నాయని పేర్కొన్నారు. ఇందుకు 17రీచ్‌లను తెరిచినట్లు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 17,890 టన్నుల ఇసుకను అమ్మినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న రీచ్‌లతోపాటు పట్టా భూములలో కూడా ఇసుక తవ్వకానికి అనుమతులు మంజూరు చేయనున్నట్లు వివరించారు. ప్రస్తుతం నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, తోట్లవల్లూరు, నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం తదితర ప్రాంతాలలో ఇసుక డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అదేవిధంగా వైఎస్సార్ నవశకం కార్యక్రమం ద్వారా వలంటీర్లతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఇసుకను రాజకీయం చేసి రాద్ధాంతం చేయటం సమంజసం కాదన్నారు. కావాలనే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇసుక రగడ సృష్టిస్తున్నాడని దుయ్యబట్టారు. అక్రమ ఇసుక వ్యాపారం చేస్తే సహించేది లేదన్నారు. ఈసందర్భంగా గత నెలలో ఆత్మహత్య చేసుకున్న జి కొండూరు మండలం వెలగలేరుకు చెందిన వేమూరి రాము అనే కౌలు రైతు కుటుంబానికి ప్రభుత్వం నుండి మంజూరైన ఏడు లక్షల రూపాయల చెక్కును కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. ఈకార్యక్రమంలో మైనింగ్, వ్యవసాయ అధికారులు, స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

దేవుడిపై.. దేవుడి ప్రసాదంపై నమ్మకం లేని వ్యక్తి ‘చంద్రబాబు’
* దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి

నూజివీడు, నవంబర్ 21: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి దేవుడన్నా, దేవుడి ప్రసాదమన్నా నమ్మకం లేదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. డివిజన్ పరిధిలోని విస్సన్నపేటలో వేంచేసియున్న శ్రీ గంగాపార్వతి సమేత చంద్రశేఖరస్వామి దేవస్థానంలో గురువారం జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రక్షణనిధితో కలసి మంత్రి వెల్లంపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ పుష్కరాల పేరిట చంద్రబాబు డబ్బు దోచుకున్నారని, విజయవాడలోని 40 దేవాలయాల్ని తొలగించిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ఐదేళ్ళ టీడీపీ పాలనలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసినా సీఎం జగన్ వెంట నడిచి చెక్కు చెదరని వ్యక్తిలా ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ఉన్నారని కితాబు ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని చూస్తే చంద్రబాబుకు భయం వేస్తోందన్నారు. ఐదు నెలల్లో దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. దేవాలయాల అభివృద్ధి కోసం, అర్చకుల శ్రేయస్సు కోసం బడ్జెట్‌లో 230 కోట్లు కేటాయించిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అని ఆయన కొనియాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. ఐతే ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

చోరగూడిలో గౌతమ బుద్ధుడి విగ్రహావిష్కరణ
పమిడిముక్కల, నవంబర్ 21: మండల పరిధిలోని చోరగూడి గ్రామంలో గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని గురువారం పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆవిష్కరించారు. మర్రి నాగభూషణం, నాగరత్నం, మాజీ సర్పంచ్ మర్రి దానయ్య జ్ఞానపకార్థం వారి కుమారుడు దుర్గారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అనిల్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో బాపూజీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.