కృష్ణ

మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: కష్టాల కడలిలో ఈదుతున్న మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని గురువారం స్థానిక జడ్పీ కనె్వన్షన్ సెంటరులో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి చేసే వృత్తి ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది మత్స్యకార వృత్తేనన్నారు. అటువంటి కుల వృత్తి చేసుకుంటున్న మత్స్యకార కుటుంబాలకు ఏ కష్టం రానివ్వమన్నారు. వారికి అన్ని విధాలా ప్రభుత్వం అండదండగా నిలుస్తుందన్నారు. వైఎస్‌ఆర్ మత్స్య భరోసా పథకం ద్వారా నాలుగు విధాలుగా ప్రయోజనం చేకూరుస్తామన్నారు. సముద్రంలో చేపల వేట నిషేధ కాలానికి గత ప్రభుత్వం ఇచ్చిన రూ.4వేలు జీవన భృతిని రూ.10వేలుకు పెంచినట్టు తెలిపారు. గతంలో కేవలం మోటారు బోటు కలిగిన మత్స్యకారులకే పరిమితమైన జీవన భృతిని తమ ప్రభుత్వం నాటు పడవలు, తెర చాపు పడవల ద్వారా చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు కూడా వర్తింప చేస్తుందన్నారు. సంప్రదాయ చేపల వేట సాగించే వారు ఒక రేషన్ కార్డులో ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నప్పటికీ వారికి కూడా ఈ పథకాన్ని వర్తించేలా కృషి చేస్తానన్నారు. మత్స్యకారులకు డీజిల్ ఆయిల్‌పై సబ్సిడీని రూ.6.03 పైసల నుండి రూ.9లకు పెంచటంతో పాటు రాయితీ మొత్తాన్ని మత్స్యకారులు ఆయిల్ తీసుకున్న క్షణంలోనే వారి అకౌంట్‌లో జమ అయ్యేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. వేట సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకార కుటుంబానికి ఇస్తున్న పరిహారాన్ని రూ.5లక్షల నుండి రూ.10లక్షలకు పెంచినట్టు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో జీఎస్‌పీఎస్ సంస్థ పైప్‌లైన్ సమయంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఓఎన్‌జీసీ సంస్థ కేవలం ఆరు నెలల కాలానికే నష్టపరిహారం చెల్లించిందని, మిగిలిన ఏడు నెలల కాలానికి రూ.78.24కోట్లు పరిహారం రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. సూర్యలంకలో 200 ఎకరాల్లో పండుగప్ప హేచరీ నిర్మాణం మంజూరైందని, త్వరలోనే నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అదే విధంగా వనామి రొయ్య సీడ్ విషయంలో నష్టపోయిన వారిని ఆదుకుంటామని వారికి మంచి సీడ్ అందిస్తామన్నారు. ఉగాది రోజు నాటికి అర్హులైన మత్స్యకారులందరికీ నివేశన స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ మత్స్య ఉత్పత్తుల్లో దేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. అదే విధంగా రొయ్యల ఉత్పత్తి 70 శాతం మన రాష్ట్రం నుండే వస్తుందన్నారు. అనంతరం వైఎస్‌ఆర్ మత్స్య భరోసా పథకానికి సంబంధించి జిల్లాలో 8,861 మందికి రూ.10వేలు చొప్పున రూ.8.86కోట్ల జీవన భృతి చెక్కులను అందజేశారు. అలాగే పలువురు ఉత్తమ మత్స్యకార రైతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 మోహన్ కుమార్, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ యాకూబ్ బాషా, ఆర్డీవో ఖాజావలి, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, మాజీ జడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, మాజీ ఎఎంసీ చైర్మన్ మోకా భాస్కరరావు, మత్స్యకార సంఘ ప్రతినిధులు లకనం నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.