కృష్ణ

‘యార్లగడ్డ’కు కేడీసీసీబీ పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: గత రెండు విడతలుగా గన్నవరం నియోజకవర్గం నుండి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావ్‌కు అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పగ్గాలు దక్కాయి. జిల్లా కలెక్టర్ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీబీ) చైర్మన్‌గా వెంకట్రావ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకట్రావ్‌తో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమితులయ్యారు. కొమ్మినేని రవిశంకర్, నల్లమోతు కోటి సూర్య ప్రకాశరావు, వేములకొండ రాంబాబు, లకావతు జీత్య, గడిదేసి పెద వెంకయ్య, పడమట సుజాతలను సభ్యులుగా నియమితులయ్యారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కేడీసీసీబీ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కొనసాగారు. కేడీసీసీబీ పాలకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఎసీఎస్) పాలకవర్గాల పదవీ కాలం ముగియటంతో వారి స్థానం త్రిసభ్య కమిటీలను నియమించారు. కేడీసీసీబీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కేడీసీసీబీ చైర్మన్‌తో పాటు సభ్యులుగా ఆరుగురిని ప్రభుత్వం నామినేటెడ్ చేయడం విశేషం. వాస్తవంగా పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన తర్వాత పీఎసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. పీఎసీఎస్ పాలకవర్గాల నుండి 11 మంది డైరెక్టర్లను ఎన్నుకుని వారిలో నుండి ఒకరిని చైర్మన్‌గా చేస్తారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల జోలికి వెళ్లకుండా పీఎసీఎస్‌లకు ఇప్పటికే త్రిసభ్య కమిటీల పేరుతో వైసీపీ నాయకులను నామినేటెడ్ చేసింది. చైర్మన్, ఆరుగురు సభ్యులను కూడా నామినేటెడ్ చేయడం విశేషం. తాజాగా నియమితులైన చైర్మన్, ఆరుగురు సభ్యులు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు కొనసాగుతారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన పదవుల్లో కేడీసీసీబీ చైర్మన్ పదవి ఒకటి. అటువంటి పదవిలో యార్లగడ్డ వెంకట్రావ్‌ను నియమించడం విశేషం. వెంకట్రావ్ గన్నవరం నియోజకవర్గంలో అధికార వైసీపీ పార్టీకి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లోనూ ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీని వీడకుండా నియోజకవర్గంలో పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ యార్లగడ్డ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. గన్నవరం నియోకవర్గంలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యార్లగడ్డకు కేడీసీసీబీ చైర్మన్ పదవిని అప్పగించారు. టీడీడీపీ తరఫున గన్నవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీకి మద్దతు పలికారు. వైసీపీలో చేరకపోయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, త్వరలోనే వైసీపీలో చేరతానని, వైసీపీలో తన చేరికకు ఎమ్మెల్యే పదవి అడ్డుగా ఉంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళతానని వంశీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీలో వంశీ చేరికను యార్లగడ్డ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. యార్లగడ్డ మాత్రం ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు నడుచుకుంటానని చెబుతూ వచ్చారు. గన్నవరం నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై పూర్తి స్థాయి అధ్యయనం చేసిన సీఎం జగన్మోహనరెడ్డి యార్లగడ్డకు కేడీసీసీబీ పగ్గాలు అప్పగించినట్టుగా ఆయన వర్గం భావిస్తోంది.

సిఫార్సులను నమ్మి మోసపోవద్దు
* పారదర్శకంగా మహిళా సంరక్షణ కార్యదర్శుల నియామకాలు
* మెరిట్ ఆధారంగానే మీ అందరికీ పోస్టింగ్‌లు * జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు

మచిలీపట్నం, డిసెంబర్ 4: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మహిళా రక్షణ కార్యదర్శులుగా నియమితులైన మీరంతా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు సూచించారు. 132 మంది మహిళా అభ్యర్థులకు మహిళా రక్షణ కార్యదర్శులుగా నియమిస్తూ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ నియామక ప్రక్రియ అంతా పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరిగిందన్నారు. మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మీరు ఎంచుకున్న ప్రాంతాలకు పోస్టింగ్‌లు ఇస్తామని, ఎవరైనా వచ్చి మీకు దగ్గరలో పోస్టింగ్‌లు ఇప్పిస్తామని మాయమాటలు చెబితే అటువంటి దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. మార్కులు, మెరిట్ ఆధారంగా పోస్టింగ్‌లు ఉంటాయన్నారు. ఎటువంటి సిఫార్సులకు తావు ఉండదని స్పష్టం చేశారు. మీ అందరి సమక్షంలోనే ఖాళీల ఆధారంగా నియామకాలు చేపట్టారని, ప్రస్తుతం మీరు నివశిస్తున్న ప్రదేశం, గ్రామం, వార్డు కాకుండా మిగిలిన వాటిని ఎంపిక చేసుకోవచ్చని, పోస్టింగ్ ఆర్డర్‌లు స్వీకరించిన అనంతరం గ్రామ పరిధిలో అయితే ఎంపీడీవో, పట్టణ పరిధిలో అయితే పురపాలక సంఘ కమిషనర్ వద్ద హాజరు కావాలన్నారు. ఈ నెలలో శిక్షణ షెడ్యూల్ వస్తుందని, దానికి సంబంధించిన వివరాలను మీకు ఫోన్ ద్వారా తెలియపరుస్తారన్నారు. మీరు నిర్వహించాల్సిన విధులు శిక్షణ కాలంలో తెలియపరుస్తారన్నారు. శిక్షణ అనంతరం జనవరి నుండి మీకు కేటాయించిన విధులకు నిరంతరాయంగా హాజరవుతారని, మీరంతా పోలీసు శాఖకు, మాతా శిశు సంరక్షణ శాఖకు అనుసంధానంగా ఉంటారని, శిక్షణ అనంతరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఒక సెమినార్‌ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అడిషనల్ ఎస్పీ సత్తిబాబు మాట్లాడుతూ ఇటీవల సంచలనం కలిగించిన డా. దిశ హత్యోదాంతంతో డీజీపీ స్పందించారని, మన ప్రదేశంలో ఇలాంటి హేయమైన చర్యలు, సంఘటనలు గాని జరుగకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. మహిళ పుట్టక ముందు నుండి మరణించేంత వరకు సమాజంలో ఎంతో వివక్షను ఎదుర్కొంటుందని, ఇంతటి వివక్ష ఉన్నప్పటికీ మీరంతా ధైర్యంగా బయటకు వచ్చి విధులు నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. సాటి మహిళగా తమ సమస్యతో మీ ముందుకొస్తే ఆ సందర్భం మీకెదురైతే మీరు ఏ విధంగా స్పందిస్తారో అని ఆలోచించి సహానుభూతిగా వ్యవహరించి వారి సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, స్పెషల్ బ్రాంచ్ సీఐ చంద్రశేఖర్, చిలకలపూడి సీ వెంకట నారాయణ, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాస్, ఆర్‌ఐ వెంకట్రావ్, డీసీఆర్‌బీ ఎస్‌ఐ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.

రైతుల సమక్షంలోనే ధాన్యం తేమ శాతాన్ని చూడండి
* కొనుగోలు కేంద్రం సిబ్బందికి మంత్రి పేర్ని ఆదేశం
మచిలీపట్నం(కోనేరుసెంటర్), డిసెంబర్ 4: రైతుల ముందే ధాన్యం తేమ శాతాన్ని చూసి కొనుగోళ్లు చేయాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మంత్రి కార్యాలయంలో బందరు నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై మంత్రి పేర్నిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. పలువురు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యానికి తేమ శాతం ఎక్కువగా ఉందని సిబ్బంది తెలుపుతున్నారని మంత్రి పేర్నికి తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి ప్రతి రైతు ధాన్యం కొనే సమయంలో వారి ఎదుటే తేమశాతం లెక్కించి వారి అనుమానాలు నివృత్తి చేసి సరైన ధర వచ్చే విధంగా చూడాలని సిబ్బందికి సూచించారు. కలిదిండి మండలం పెదలంక గ్రామంలో పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆచార్య ధనుంజయ మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి ఫోన్‌లో జిల్లా విద్యాశాఖాధికారిణితో మాట్లాడగా ఈ సంవత్సరం పరీక్షా కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందని, వచ్చే సంవత్సరం నుండి ఈ ప్రాంతంలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని విద్యాశాఖాధికారిణి తెలిపారు. సుకర్లాబాదకు చెందిన కలిశెట్టి లక్ష్మి తన భర్త అప్పారావు చనిపోయాడని, ఆయన పేరున ఉన్న చెక్కును తన ఖాతాలో జమ చేసుకోవాలంటే ఫ్యామిలీ మెంబర్స్ సర్ట్ఫికేట్ కావాలని అడుగుతున్నారని మంత్రికి తెలిపారు. వెంటనే మంత్రి పేర్ని తహశీల్దార్‌కు ఫోన్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ సర్ట్ఫికేట్ ఇవ్వాలని సిఫార్సు చేశారు. రాజుపేటకు చెందిన తూతా నాగేశ్వరరావు తనకు మచిలీపట్నంలో నిర్మించిన జీ ప్లస్ 3 గృహ సముదాయంలో ఇంటి మంజూరు పత్రాన్ని అధికారులు జారీ చేశారని, ఇప్పడైతే తనకు గృహం మంజూరు కాలేదని అంటున్నారని మంత్రికి తగు ఆధారాలతో తెలియజేశారు. అన్ని పరిశీలించిన మంత్రి మున్సిపల్ సిబ్బందికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.