కృష్ణ

మహిళల్లో చైతన్యం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక: సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలను నివారించేందుకు మహిళల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాగాయలంక ఎస్‌ఐ చల్లా కృష్ణ అన్నారు. బుధవారం స్థానిక పోలీసు స్టేషన్ వద్ద మహిళా మిత్ర కమిటీ ఏర్పాటు సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ అనునిత్యం వివిధ ప్రదేశాలలో చిన్నారులపై, వివాహితులపై జరుగుతూ వస్తున్న అఘాయిత్యాలను మహిళలు సంఘటితంగా ఎదుర్కొన్నప్పుడే అటువంటి సంఘటనలు తిరిగి పునరావృతం కావని చెప్పారు. అనుచితంగా ప్రవర్తించే వారిపై మహిళలు దృష్టి సారించాలన్నారు. మహిళా మిత్ర కమిటీ సభ్యులుగా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి సింహాద్రి రోజా, స్వచ్ఛ నాగాయలంక ప్రతినిధులుగా జుజ్జవరపు సుమతి, ఆశ కార్యకర్త బందెల అనిత, అంగన్‌వాడీ కార్యకర్త మద్దుల నిర్మలాజ్యోతి, ఐసీడీఎస్ ఉద్యోగి నాగినేని నిర్మల, బుక్ కీపర్ సబ్బినేని విజయలక్ష్మి, మహిళా కానిస్టేబుల్ స్వాతి తదితరులు పాల్గొన్నారు.