కృష్ణ

రైతుబజారులో మంత్రి రవీంద్ర ఆకస్మిక తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 26: రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం స్థానిక రైతుబజారును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు తాజా కూరగాయలు, ధరల పట్టిక, మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో రైతుబజారులో పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పేదలకు సరసమైన ధరలకే కూరగాయలు అందించాలనే ఉద్దేశంతో గతంలో చంద్రబాబు నాయుడు రైతుబజార్లను ఏర్పాటు చేశారన్నారు. ఆ లక్ష్యం నెరవేర్చడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. రైతుబజారులో రైతులు వినియోగదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, తూనికల్లో ఎలాంటి తేడాలు రానివ్వద్దని, తేడా వస్తే ఆ రైతును తొలగిస్తామని హెచ్చరించారు. శానిటరీ విషయంలో ఎలాంటి అశ్రద్ధ చేయవద్దని మున్సిపల్ అధికారులకు సూచించారు. పట్టణంలో మూడు రైతుబజార్లు అవసరమని గుర్తించామన్నారు. ప్రస్తుతం మరొక రైతుబజారును రాజుపేటలో నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలించామన్నారు.
త్వరలో అక్కడ రైతుబజారు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రైతుబజారులో నర్సరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి రవీంద్ర వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్ ఛైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, జెడ్పీటిసి లంకే నారాయణప్రసాద్, నారగాని ఆంజనేయప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.