కృష్ణ

నారుమడులు కళకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన 32.2 మి.మీ.ల భారీ వర్షం నారుమడులకు నీటి కొరతను అధిగమింపచేసి భూగర్భ జలాల్ని పెంచిం ది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు అడుగంటటంతో జూన్ లో కృష్ణా జలాలతో నిండుగా పారే కాలువలు ఒట్టిపోయాయి. రెండు నెలలుగా అరకొరగా మంచినీటి కోసం విడుదల చేస్తున్న కృష్ణా జలాలు రైతుల అవసరాలకు ఉపయోగపడలేదు. దీంతో ఖరీఫ్ సాగుపై రైతులు ఆందోళన చెందారు. ఈనేపథ్యంలో మే నెలలో ఆరురోజుల పాటు 171.6 మి.మీ.ల వర్షం కురిసినా భానుడి ప్రతాపానికి నీరు ఆవిరయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటటంతో విద్యుత్ మోటార్లు, ఇంజన్లతో ఖరీఫ్ సాగు చేద్దామనుకున్న రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ నెల ప్రారంభం నుండి 11 రోజుల పాటు మండలంలో 263.6 మి.మీ.ల వర్షం కురవడంతో దాదాపు నారుమడులకు అవసరమైన నీరు లభించటంతో రైతుల ఆశలు చిగురించాయి. గత 15 రోజుల నుండి పోస్తున్న నారుమడులు వర్షం నీటితో నవనవలాడుతున్నాయి. డిసెంబరు వరకు నెలకు నాలుగు రోజులు ఇలానే భారీ వర్షాలు కురిస్తే కృష్ణా జలాల సమస్య ఉండదని రైతులు అంటున్నారు.