కృష్ణ

ఖరీఫ్ సాగుకు వరంలా వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 26: ఖరీఫ్ సాగుకు వర్షం వరంగా మారుతోంది. కృష్ణా జలాలు విడుదల చేయకపోయినా వరుణ దేవుడి కరుణతో జిల్లాలో విస్తారంగా నారుమడులు పోస్తున్నారు. ఈ నెలలో కురిసిన వర్షాలకు కాలువలు, చెరువులు, బోదెలు, గుంటలు నీటితో నిండిపోవటంతో వాటిని ఆధారంగా చేసుకుని రైతులు ఆకుమడులను వేస్తున్నారు. ఇప్పటికే వేసిన నారుమడులు వర్షానికి కళకళలాడుతున్నాయి. మొన్నటివరకు మిన్నకున్న రైతులు శని, ఆదివారాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జోరుగా ఆకుమతులను తయారుచేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కృష్ణా జలాలు విడుదల చేయకపోయినా పంట కాలువలు వర్షం నీటితో నిండుగా దర్శనమిస్తున్నాయి. ఏదిఏమైనా వరుణుడు మాత్రం రైతులను ఆదుకుంటున్నాడనడంలో సందేహం లేదు.