కృష్ణ

ఎన్టీఆర్ గృహాలు ఏమయ్యాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జూన్ 28: రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్న ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా పేదలకు ఇళ్లు మంజూరు చేయటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన విమర్శించారు. మొవ్వ ఎంపిపి కిలారపు మంగమ్మ అధ్యక్షతన ఎంపిడివో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మండలంలో ఐఎవై పథకం ద్వారా ఎన్ని గృహాలు నిర్మించారని అడిగిన ప్రశ్నకు హౌసింగ్ ఎఇ వివి భాస్కరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూ.లక్షా 10వేల వరకు ఇస్తున్న నిధులతో గృహ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏమయ్యాయన్న కల్పన ప్రశ్నకు అధికారులు బదులివ్వలేదు. కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా పేర్కొంటున్న వైఖరిని ఆమె ఎద్దేవా చేశారు. రెండు నెలల్లో పుష్కరాలు సమీపిస్తున్నా ఆర్ అండ్ బి అధికారులు రహదారి నిర్మాణాలు పూర్తి చేయలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ పోల్స్, ట్రాన్స్‌ఫారాల కొరతపై ఎఇ వి శివన్నారాయణను ప్రశ్నించగా ప్రభుత్వం కేటాయించలేదని తెలిపారు. ఆర్ అండ్ బి శాఖ ఐఎన్‌కె పరిధిలోని పెదపూడి శివారు బీమనది డ్రైన్‌పై నిర్మించిన వంతెన అప్రోచ్ రోడ్లు చేపట్టకపోవటంతో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని, వెంటనే అప్రోచ్‌ను నిర్మించాలని ఎఇ ఐ శ్రీనివాసరావుకు కల్పన సూచించారు. అయితే వంతెన నిర్మాణం తాను చేపట్టలేదని, ఇరిగేషన్ శాఖ నిర్మించిందని ఎఇ తెలిపారు. దీంతో ఇరిగేషన్ శాఖాధికారి సభకు హాజరుకాక పోవటంతో సంబంధిత శాఖ ఉన్నతాధికారిని ఫోన్‌లో సంప్రదించారు. ఈ సమస్య తమ దృష్టికి రాలేదని ఆయన చెప్పటంతో ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే వంతెనకు అప్రోచ్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. నీరు-చెట్టు పథకం కింద చెరువులో మట్టి తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. రంజాన్ తోఫా పంపిణీపై సంబంధిత అధికారులను వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం రాలేదని జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కల్పన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అమలుపర్చటంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేసుకోవాలని సూచించారు. సమావేశానికి హాజరుకాని అధికారులకు మెమోలు ఇవ్వాలని ఎంపిడివో వై పిచ్చిరెడ్డిని ఆదేశించారు. అధికారులను అడిగేదానికన్నా కలెక్టర్ వద్ద కూర్చుంటే గంటలో పని పూర్తవుతుందని ఆమె అన్నారు. ఎంపిపి కిలారపు మంగమ్మ, ఎంపిడివో పిచ్చిరెడ్డి, వైస్ ఎంపిపి వీరేంద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.