కృష్ణ

నాట్యక్షేత్రం అభివృద్ధి అంతేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జూన్ 28: నాట్యక్షేత్రం కూచిపూడి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న సిలికానాంధ్ర వసుధైక కుటుంబం అభివృద్ధి కార్యక్రమానికి కామా పెట్టిందా, ఫుల్‌స్టాప్ పెట్టిందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన స్మార్ట్ విలేజ్‌లో భాగంగా ఈ గ్రామాన్ని ఛైర్మన్ కూచిభొట్ల ఆనంద్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపు రూ.3కోట్లకు పైగా విదేశీయుల విరాళాలతో గ్రామంలో దాదాపు 75శాతం సిమెంటు రోడ్లను నిర్మించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆధునీకరించారు. దుర్గంధభూయిష్టంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లో పార్కును నిర్మించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఎల్‌ఇడి బల్బులతో వీధిదీపాలు వెలిగించారు. ఇలా గ్రామాన్ని అన్నివిధాలా పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దుతున్న నాట్యారామ కమిటీ ఛైర్మన్ కూచిభొట్ల ఆనంద్‌పై సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు, దూషణ, భూషణలు హోరెత్తించడంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. గ్రామాభివృద్ధికి నిధు లిచ్చే దాతలకు ఫేస్‌బుక్ ద్వారా వారిలో వ్యతిరేక భావాలు కలిగించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆనంద్ నిరాసక్తి కారణంగా మూడు నెలలుగా గ్రామాభివృద్ధి కుంటుపడింది. ఈనేపథ్యంలో ప్రభుత్వం మంజూరు చేయాల్సిన నిధులు కూడా అధికారులు వాయిదా వేయటం ఆయన వ్యతిరేక వర్గీయులకు సంతోషం కలిగించినా అభిమానులకు, గ్రామాభివృద్ధి పట్ల ఆసక్తి కలిగిన వారు నిరాశ చెందుతున్నారు. ఏదిఏమైనా గ్రామాభివృద్ధికి ఆనంద్ కట్టుబడే ఉంటారనే విశ్వాసం ప్రజల్లో పూర్తిగా ఉంది. ఈనేపథ్యంలో కూచిపూడి గ్రామ పరిధిలోని పెడసనగల్లు ఆర్ అండ్ బి రహదారిలో ఆక్రమించుకున్న కలప దుకాణాల యజమానులు ఆనంద్ హెచ్చరికతో వాటిని తొలగించినా తిరిగి ఆక్రమణలు ప్రారంభించటం గమనార్హం. అలాగే ప్రధాన రహదారి అభివృద్ధిని పట్టించుకునేవారు లేకపోవటంతో సుందరంగా తీర్చిదిద్దిన జెడ్పీ హైస్కూల్ ముందుభాగం బురదకయ్యగా మారి విద్యార్థులను ఇక్కట్లపాలు చేస్తోంది.