కృష్ణ

అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 28: జిల్లా పరిషత్ ద్వారా జరుగుతున్న రహదారి, పుష్కర అభివృద్ధి పనులు మండలాల వారీ ప్రజాప్రతినిధుల పరిశీలన కోసం యాత్రలు ఏర్పాటు చేయాలని జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పరిషత్ స్థారుూ సంఘ సమావేశాలు నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, స్ర్తి శిశు సంక్షేమం, ప్లానింగ్, ఆర్థిక పనుల అంశాలపై జరిగిన స్థారుూ సంఘ సమావేశాలకు ఛైర్‌పర్సన్ అనూరాధ అధ్యక్షత వహించారు. జెడ్పీ వైస్ ఛైర్‌పర్సన్ శాయిన పుష్పవతి అధ్యక్షతన వ్యవసాయం, బంటుమిల్లి జెడ్పీటిసి దాసరి కరుణాజ్యోతి అధ్యక్షతన సాంఘిక సంక్షేమం స్థారుూ సంఘ సమావేశాలు జరిగాయి. గ్రామీణాభివృద్ధి సంఘ సమావేశంలో పలువురు జెడ్పీటిసిలు వారి మండలాల్లో పంచాయతీరాజ్ అభివృద్ధి పనులు, జెడ్పీ నిధులతో చేపట్టిన పిఆర్ పనులు, పుష్కర పనులు పెద్దఎత్తున జరుగుతున్నప్పటికీ సరైన నాణ్యత పాటించడం లేదని ఫిర్యాదు చేశారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి పంచాయతీరాజ్, తదితర శాఖల ద్వారా జెడ్పీ నిధులతో అభివృద్ధి చేస్తున్న రహదారులు, పాఠశాలలు, అంగన్‌వాడీ భవనాలు, తదితర అభివృద్ధి పనులు సమగ్ర సమాచారం సభ్యులకు తప్పనిసరిగా తెలియజేయాలని చైర్‌పర్సన్ అనూరాధ ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో అత్యధికంగా 4,500 కి.మీ.ల పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం జరిగినందుకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందన్నారు. ప్రజాప్రతినిధులు జరుగుతున్న పనులు అన్ని మండలాల్లో తనిఖీ కోసం రానున్న సర్వసభ్య సమావేశంలోగా యాత్ర నిర్వహించాలన్నారు. రాజధాని రావడంతో జిల్లాలో రహదారుల విస్తరణ పెద్దఎత్తున జరుగుతుందన్నారు. మునుపెన్నడూ జరగని విధంగా మండలాల్లో రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన చర్చలో వైద్యాధికారులపై చైర్‌పర్సన్‌తో పాటు పలువురు జెడ్పీటిసిలు, ఎంపిపిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నర నుండి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గానీ, పిహెచ్‌సిలలో గానీ అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించడం లేదన్నారు. ఫలితంగా ఆస్పత్రులు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. కుంటిసాకులతో వైద్యాధికారులు తప్పించుకుంటున్నారని చైర్‌పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న సర్వసభ్య సమావేశం నాటికి అభివృద్ధి కమిటీ సమావేశాల నిర్వహణపై లిఖిత పూర్వకంగా తెలియచేయాలన్నారు. ఇంకుడు గుంతలు, నీటి కుంటల తవ్వకంలో లక్ష్యాన్ని అధిగమించడంలో డ్వామా అధికారులు విఫలమయ్యారని పలువురు ఆరోపించారు. రైతుల్లో అవగాహన కల్పించకపోవడం వల్ల నీటి కుంటలు అనుకున్న మేర తవ్వలేదన్నారు. ఈ సమావేశంలో పెడన శాసనసభ్యులు కాగిత వెంకట్రావ్, ఇన్‌ఛార్జ్ సిఇఓ నాగమహేశ్వరరావు, డ్వామా పిడి మాధవీలత, డిఎంహెచ్‌ఓ డా. నాగమల్లేశ్వరి, ఐసిడిఎస్ పీడీ కృష్ణకుమారి, డిఎస్‌ఓ రవికిరణ్, డిఆర్‌డిఎ పీడీ చంద్రశేఖర్, డిఇఓ ఎ సుబ్బారెడ్డి, వివిధ శాఖల అధికారులు, జెడ్పీటిసిలు, ఎంపిపిలు పాల్గొన్నారు.