కృష్ణ

నీళ్ల విరేచనాలు ప్రబలకుండా రోటావైరస్ వ్యాక్సిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 5: డయేరియా రాకుండా ‘రోటా వైరస్’ అనే వ్యాక్సిన్‌ను ప్రవేశపెడతామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. జిల్లాలో ప్రతి చిన్నారికి, బాలింతకు, గర్భిణీకి ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వివిధ రకాలైన సేవలను అందించడంతో పాటు వాక్సినేషన్ చేస్తున్నామన్నారు. మిషన్ ఇంద్రధనస్సు ఇమ్యునేజేషన్ కార్యక్రమంలో భాగంగా 3వ రౌండ్ ఏప్రిల్ నుండి జూలై వరకు 4 నెలలు ప్రతి నెలా 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగే కార్యక్రమం నిమిత్తం జిల్లా టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమంలో జిల్లాలోని 0-5 సంవత్సరాల్లోపు పిల్లలను సర్వే చేసి ఆరు రకాలైన ఇమ్యూనేజేషన్ వాక్సినేషన్ ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బిసిజి, పోలియో చుక్కలు, పెంటావాలెంట్, మీజిల్స్ (తట్టు) జెఇ, డిపిటి, ఇమ్యూనేజేషన్ వాక్సినేషన్ ద్వారా 7 రకాల వ్యాధులు రాకుండా 5 సంవత్సరాల్లోపు పిల్లలకు ఇస్తామన్నారు. గర్భిణీలు కూడా ధనుర్వాతం రాకుండా టిటి ఇంజక్షన్లు తప్పనిసరిగా చేయించుకోవాలని, ఈ ఇంజక్షన్లు ప్రాథమిక, ఉప తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇస్తామన్నారు. జిల్లాలో 4 లక్షలు పైగా 5 సంవత్సరాల్లోపు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. వారిలో బిసిజి చేయించుకున్న చిన్నారులు వంద శాతం, పోలియో చుక్కలు వేయించుకున్న వారు 74.1 శాతం, మీజిల్స్ వేయించుకున్నవారు 100 శాతం, హెపటైటిస్ బి వాక్సిన్‌ను వేయించుకున్న వారు 80.8 శాతం, డిపిటి వేయించుకున్న వారు 97.2 శాతంతో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఏ ఒక్క వాక్సినేషన్ చేయించుకోకపోయినా ప్రమాదకరమైన వ్యాధితో ఇబ్బంది పడవలసి ఉంటుందని, తల్లిదండ్రులు గుర్తించి సంబంధిత ఇమ్యునేజేషన్ చిన్నారులకు వేయించాలని తెలిపారు.