కృష్ణ

చరిత్రలో నిలిచిపోయేలా పుష్కర యాత్రీకులకు సౌకర్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, జూలై 1: చరిత్రలో నిలిచిపోయేలా పుష్కర యాత్రీకులకు సౌకర్యాలు కల్పించాలని ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కృష్ణా పుష్కర ఏర్పాట్లపై అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని దేవాలయాల ప్రస్థావన స్కంధ పురాణంలో ఉందన్నారు. 30 పుష్కర ఘాట్లు, 50 ప్రసిద్ధ దేవాలయాల ప్రాశస్త్యం దృష్ట్య పుష్కరాలకు తరలివచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేయటంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గోదావరి పుష్కరాలకు మించి కృష్ణా పుష్కరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. హంసలదీవి, పెదకళ్ళేపల్లి, శ్రీకాకుళం ఘాట్లలో దాతల సహకారంతో నిరంతర భోజన ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యా సంస్థల సహకారం కూడా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పి సాయిబాబు, ఎంపిపి యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.