కృష్ణ

టాటా ట్రస్ట్ సహకారంతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరుచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, జూలై 4: విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టాటా ట్రస్ట్ ప్రతినిధులు అందిస్తున్న సేవలను ఉపయోగించుకొని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరుచుకోవాలని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు. టాటా ట్రస్ట్ సౌజన్యంతో మండలంలోని చందాపురం గ్రామంలో నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరగ్గా సోమవారం బందరు ఎంపి కొనకళ్ల నారాయణ, నందిగామ, జగ్గయ్యపేట ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటి ఇంకుడు గుంట నిర్మాణ పనులు ప్రారంభించారు. అనంతరం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండల తెదేపా అధ్యక్షుడు చిరుమామిళ్ల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎంపి కేశినేని నాని మాట్లాడుతూ విభజన కష్టాలు, 1500కోట్ల లోటు బడ్జెట్‌లో రాష్ట్రం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పధంవైపు పయనించే దిశగా చర్యలు చేపడుతున్నారని, అందులో భాగంగా స్వచ్చ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంపై తాను కోరిన వెంటనే ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా సమ్మతించి తమ టాటా ట్రస్ట్ ద్వారా సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. టాటా టెలీ కమ్యూనికేషన్‌లో ఉన్నత స్థానంలో ఉన్న అధికారి పవిత్రకుమార్‌ను విజయవాడ కేంద్రంగా ట్రస్ట్ సేవా కార్యక్రమాల నిర్వహణకు డైరెక్టర్‌గా నియమించారన్నారు. స్వచ్చ్భారత్ మిషన్‌లో భాగంగా టాటా ట్రస్ట్ సహకారంతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి లక్షా 8వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి ఒడిఎఫ్ నియోజకవర్గంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధి పధంలో పయనించేందుకు అధికార యంత్రాంగం అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. టాటా ట్రస్ట్ అందిస్తున్న సేవలను అసెంబ్లీ నియోజకవర్గాల్లో వినియోగించుకోవాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో 110మంది ఇంటర్నెట్ పాతీలను నియమించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న ట్యాబ్‌ల వినియోగంపై మహిళలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని టాటా ట్రస్ట్ చేపట్టినట్లు తెలిపారు. తాను సహజంగా ఎవరినీ విమర్శించనని అయితే విజయవాడ అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70సంవత్సరాలు అవుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో కనీస అవసరాలైన మరుగుదొడ్ల నిర్మాణంలో వెనుకబడి ఉన్నామన్నారు. టాటా ట్రస్ట్ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ దేశంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పనులు జరుగుతున్నాయన్నారు. ఎంపి నాని ప్రత్యేక చొరవతో ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం నుండి నిధులు మంజూరు చేయించి పనులు వేగవంతంగా చేయిస్తున్నారని అన్నారు. టాటా ట్రస్ట్ డైరెక్టర్ పవిత్రకుమార్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం సహకారంతో ప్రణాళికా బద్దంగా టాటా ట్రస్ట్ పని చేస్తుందని, ముఖ్యంగా గ్రామస్తులకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కల్పించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.