కృష్ణ

రంగా విగ్రహ ధ్వంసం కేసులో దోషుల కోసం వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 5: స్థానిక నిజాంపేటలో దివంగత నేత వంగవీటి మోహన రంగా విగ్రహ ధ్వంసం కేసు దర్యాప్తులో పురోగతి సాధించేందుకు పోలీసులు నానాతంటాలు పడుతున్నారు. రాష్టవ్య్రాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో పాటు అదనపు డిజిపి ఆర్‌పి ఠాకూర్, విశాఖ రీజియన్ ఐజి కుమార్ విశ్వజిత్ సోమవారం మచిలీపట్నం వచ్చి ఈ ఘటనపై జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి విజయ్ కుమార్ ఈ కేసును మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దోషులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మంగళవారం సుమారు 20 మంది అనుమానితులను విచారించినట్టు తెలిసింది. అయితే వీరిలో కొందరిని పంపించివేయగా ఒకరిద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. విచారణ పేరుతో పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. అమాయకులను సైతం ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణలో తమదైన శైలిని ప్రదర్శించినట్టు తెలుస్తోంది. నిజాంపేటకు చెందిన కొందరు రంగా అభిమానులను రాత్రి పొద్దుపోయే వరకు స్టేషన్‌లో ఉంచి పోలీసులు నానారకాలుగా వేధించినట్లు తెలుస్తోంది. తీవ్రంగా కొట్టడంతో పాటు విగ్రహ ధ్వంసానికి పాల్పడింది మేమేనని ఒప్పుకోవాల్సిందిగా చితకబాదారని అంటున్నారు. దీన్ని కాపు నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ కాశీవిశ్వనాథం, 9వ వార్డు కౌన్సిలర్ కొట్టె వెంకట్రావ్, మిరియాల కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు గంటా సురేష్, మరికొందరు చిలకలపూడి పోలీసు స్టేషన్‌కు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అమాయకులపై కేసులు నమోదు చేస్తే సహించేది లేదంటూ వైస్ చైర్మన్ కాశీవిశ్వనాథం హెచ్చరించారు. దీనిపై డిఎస్పీ శ్రావణ్ కుమార్‌ను ప్రశ్నించగా కేవలం అనుమానితులను మాత్రమే అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలిపారు. కేసు దర్యాప్తులో కొంత పురోగతి సాధించామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆయన వివరించారు.