కృష్ణ

రంజాన్ పర్వదినం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, జూలై 7: రంజాన్ పర్వదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో ముస్లింలు గురువారం ఈద్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని నూతన వస్త్రాలు ధరించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వందలాది మంది ప్రార్థనలకు ఈద్గా వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంది. చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం చూపరులను ఆకట్టుకుంది. వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.