కృష్ణ

పోలీసుల జులుంకు నిరసనగా 3 గంటలపాటు ట్రాఫిక్ దిగ్బంధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విస్సన్నపేట, జూలై 8: స్కూటర్ పార్కింగ్ చేసే విషయంలో ట్రైనీ ఎస్సై కె.శ్రీనివాస్‌కు స్కూటరిస్టులకు వాగ్వివాదం జరిగి మూడు గంటల పాటు ట్రాఫిక్ దిగ్బంధనంతో పాటు ఆందోళనకు దారి తీసిన సంఘటన శుక్రవారం రాత్రి 7 గంటలకు విస్సన్నపేటలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. విస్సన్నపేటకు చెందిని సుంకర గాంధీ, ఆయన కుమార్తె శిరీష, కుమారుడు రాజేంద్రప్రసాద్‌లు గాంధీ బొమ్మ సెంటరులో వస్తువులు కొనుగోలు చేసేందుకు ఒక ఫ్యాన్సీ దుకాణం ముందు తమ స్కూటర్‌ను నిలిపారు. అప్పుడే అక్కడకు సిబ్బందితో వాహనంపై వచ్చిన చాట్రాయి ట్రైనీ ఎస్సై కె.శ్రీనివాస్ వచ్చి రోడ్డుపక్కన వాహనం నిలిపినందుకు అపరాధం విధిస్తున్నానంటూ కేసు రాయడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ అపరాధం చెల్లించడం జరిగింది. వస్తువులు కొనుగోలు చేసి వెళ్లిపోతాం, దీనికే అపరాధం విధించాలా? అని శిరీష ప్రశ్నించడంతో ఎస్‌ఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డు మార్జిన్‌లో వాహనాలు నిలపడమే కాక ప్రశ్నిస్తున్నారంటూ యువతిపై శిరీషపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయమై ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. దీంతో ఎస్సై చెయ్యూపుతూ హెచ్చరించి దుకాణంలోని కుర్చీలు, స్టూళ్లను తీసుకొని అక్కడ నుంచి వెళ్లాడు. దీంతో శిరీష తనకు జరిగిన అవమానాన్ని తన బంధువులకు తెలపడంతో వారంతా షాపు వద్దకు వచ్చారు. దగ్గరలోని గాంధీబొమ్మ సెంటరులో తనకు న్యాయం చేయాలని, తనపై దురుసుగా ప్రవర్తించిన ఎస్‌ఐ శ్రీనివాస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించింది. రాత్రి 7 గంటల సమయం కావటంతో జనం ఎక్కువ సంఖ్యలో ఉండి ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇటీవలి కాలంలో పోలీసులు కేసులు ఎక్కువగా రాసి వాహనదారులను ఇబ్బంది పెడుతుండటంతో చాలా మంది ఆమెకు మద్దతు ఇవ్వటం జరిగింది. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను నిలిపివేశారు. దీంతో కిమీ మేర వాహనాలు నిలిచిపోయాయి. తిరువూరు సిఐ కిషోర్ బాబు సంఘటనా స్థలికి వచ్చి బాధిత యువతితో మాట్లాడి వివరాలు తెలుసుకుని రాజీ చేసేందుకు ప్రయత్నించారు. ఈ లోగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా జోక్యం చేసుకుని రాజీ ప్రయత్నం చేసినప్పటికీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ట్రెయినీ ఎస్‌ఐ శ్రీనివాస్ సిఐ కిషోర్ బాబు ఆదేశాల మేరకు సంఘటన స్థలానికి వచ్చి విధి నిర్వహణలో భాగంగానే అపరాధం విధించాను తప్ప తాను తప్పు చేయలేదని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. దీంతో ఆందోళనకారులు మరింతగా ఆందోళనకు దిగారు. సిఐ కిషోర్ బాబు ఎంతో సమన్వయం పాటించి పరిస్థితి విషమించకుండా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎస్‌ఐ శ్రీనివాస్ క్షమాపణకు ససేమిరా అనడంతో రాత్రి 11 గంటలకు కూడా సమస్య అలానే కొనసాగుతూ ఉంది. ఈ లోగా భావరాజు సాయి కిషోర్ అనే హోటల్ కార్మికుడు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ వంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించబోగా పక్కనే ఉన్న వారు అతనిపై నీరు పోసి పక్కకు తీసుకువెళ్లారు.