కృష్ణ

పుష్కర భక్తులకు సకల సదుపాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, జూలై 12: కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపి కొనకళ్ళ నారాయణరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం నియోజకవర్గంలోని పెదకళ్ళేపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, హంసలదీవి, సాగర సంగమంలో నిర్మాణంలో ఉన్న పుష్కర ఘాట్ల పనులను వారు పరిశీలించారు. నెలాఖరులోపు అన్ని పనులు పూర్తిచేయాలని అధికారులను కోరారు. ఈసందర్భంగా వారు అవనిగడ్డలో విలేఖర్లతో మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.49.92లక్షల పుష్కర నిధులు వ్యయం చేస్తున్నట్లు వారు వెల్లడించారు. పంచాయతీరాజ్ 43 రహదారులకు రూ.14.07కోట్లు, సాగరసంగమం రోడ్డుకు రూ.3.80 కోట్లు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని 49 ఆలయాలకు రూ.3.64 కోట్లు, డ్రైనేజీ శాఖ 24 పనులకు రూ.2.14 కోట్లు, ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ మరుగుదొడ్లు, మంచినీటి సరఫరాకు రూ.2.10 కోట్లు, ఆర్ అండ్ బి శాఖ 8 రహదారులకు రూ.20.80 కోట్లు, విద్యుత్ శాఖకు చెందిన 50 పనులకు రూ.2.32 కోట్లు, జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే 8 పుష్కర ఘాట్లకు రూ.1.05 కోట్లు చొప్పున వ్యయం చేస్తున్నామన్నారు. పుష్కరనగర్‌ల ఏర్పాటు గురించి వివరిస్తూ శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెదకళ్ళేపల్లిలో సంస్కృత ఉన్నత పాఠశాల, మోపిదేవిలో గురుకుల పాఠశాల, అవనిగడ్డలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నాగాయలంకలో శ్రీరామపాద క్షేత్రం, పాలకాయతిప్పలో డాల్ఫిన్ భవనాలను పుష్కరనగర్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవనిగడ్డ మండలంలో ఎడ్లంక, కొత్తపేట, పులిగడ్డ, దక్షణ చిరువోల్లంక, వేకనూరులలో ఆరు పుష్కరఘాట్లు, చల్లపల్లి మండలంలో రాముడుపాలెం, నడకుదురు, ఘంటసాల మండలంలో శ్రీకాకుళం, పాప వినాశనం, కోడూరు మండలంలో పాలకాయతిప్ప, పిట్టలంక, సాలెంపాలెం, విశ్వనాధపల్లి, వి కొత్తపాలెం, ఉల్లిపాలెం, వేణుగోపాలపురం, మోపిదేవి మండలంలో పెదకళ్ళేపల్లి, మోపిదేవి వార్పు, కోసూరువారిపాలెం, బొబ్బర్లంక, పి కొత్తపాలెం, నాగాయతిప్ప, ఉత్తర చిరువోల్లంక, మేళ్ళమర్తిలంక, నాగాయలంకలో రెండు ఘాట్లు, బ్రహ్మానంద పురం, టి కొత్తపాలెం, పెదపాలెం, ఏటిమొగ, పెదకమ్మవారిపాలెం, ఎదురుమొండి, గుల్లలమోదలలో మొత్తం 33 ఘాట్ల నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ పర్యటనలో తహశీల్దార్లు, ఎంపిడివోలు, డిఎస్పీ ఖాదర్ బాషా, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.