కృష్ణ

కక్షిదారుల సేవలకు కట్టుబడి ఉంటా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (లీగల్), జూలై 12: కేసుల సత్వర పరిష్కారం వల్ల న్యాయ వ్యవస్థపై కక్షిదారులకు విశ్వాసం పెరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు అన్నారు. కక్షిదారుల సేవలకు కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మణరావును పట్టణ న్యాయవాదులు మంగళవారం ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి న్యాయవాదులు సహకరించాలని కోరారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. న్యాయ వ్యవస్థ పరంగా పురాతన చరిత్ర కలిగిన మచిలీపట్నంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా రావటం గొప్ప సదావకాశంగా భావిస్తున్నానన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం రామకృష్ణ మాట్లాడుతూ ఇక్కడి సీనియర్ న్యాయవాదుల వాదనల నుండి కొత్త విషయాలు తెలుస్తున్నాయన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పట్టణ న్యాయవాదుల సంఘ అధ్యక్షులు కూనపరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా ముఖ్య పట్టణాలలో ఏర్పాటు చేయాల్సిన న్యాయస్థానాలను విజయవాడలో కాకుండా మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలని న్యాయమూర్తికి విన్నవించారు. సంఘ ప్రధాన కార్యదర్శి తుంగల హరిబాబు స్వాగతం పలికారు. కార్యక్రమంలో వివిధ న్యాయస్థానాలకు చెందిన న్యాయమూర్తులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తి లక్ష్మణరావు మొక్కలు నాటారు.