కృష్ణ

కలుషితం కానిది ఉపాధ్యాయ వృత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదినేపల్లి, జూలై 14: సమాజాన్ని తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే ఉందని, కలుషితం కానిది ఉపాధ్యాయ వృత్తి మాత్రమేనని రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా కామినేని శ్రీనివాస్ అన్నారు. ముదినేపల్లి మండలం వణుదుర్రు, ఊటుకూరు, పెయ్యేరు, దాకరం, పెదపాలపర్రు గ్రామాల్లో గురువారం ఆయన సుడిగాలి పర్యటన చేసి అంగన్‌వాడీ భవనాలను, పాఠశాలలను ప్రారంభించారు. రైతులకు సాగు నీరందక ఇక్కట్లు పడుతున్న క్రమంలో పెయ్యేరు, దాకరం గ్రామాల్లో పోల్‌రాజ్ కాలువపై జరిగిన, జరుగుతున్న డెల్టా ఆధునికీకరణ పనులను ఆయన పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌నుఆదేశించారు. అనంతరం పెదపాలపర్రు ఉన్నత జిల్లా పరిషత్ పాఠశాలలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ పిఆర్‌సిని పెంచి రూ. 9వేల కోట్లు భారమైనప్పటికీ ముఖ్యమంత్రి పెంచి ప్రభుత్వ ఉద్యోగులకు సహకారమందించాలని ఆ విధంగానే ఉద్యోగులు తమ విధులు నిర్వహించాలన్నారు. విద్య, వైద్యం నేడు కార్పొరేట్ మయమయ్యాయని వాటికి ధీటుగా విద్య వైద్య సదుపాయాలను అందించి ప్రజామన్నన పొందిన నాడే ప్రభుత్వం వెచ్చించే కోట్లాది రూపాయలకు సార్ధకత చేకూరుతుందన్నారు. ఏలూరు ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చెట్లను నరికివేయటం వల్ల రానున్న రోజుల్లో 40 ఏళ్లలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. ఈ క్రమంలో భావితరాల పరిరక్షణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రతి ఇంటి ఆవరణలో విధిగా కనీసం పది మొక్కలన్నా నాటి వాటిని సంరక్షించాలన్నారు. కైకలూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి జయమంగళ వెంకటరమణ నియోజకవర్గ స్థాయిలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రిని, ఎంపి మాగంటి బాబుని కోరారు. మండల టిడిపి పార్టీ అధ్యక్షులు చళ్ళగుళ్ల శోభనాద్రి చౌదరి, ఎంపిపి పోసిన కుమారి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఈడ్పుగంటి వెంకట్రామయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.