కృష్ణ

సీతారాం గురుదేవులు, సాయినాథునికి భక్తుల పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జూలై 19: శ్రీ సీతారాం గురుంభజే.. అంటూ నిత్యం భక్తులు కొలిచే ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం గురుదేవులను గురుపూర్ణిమ సందర్భంగా పూజించేందుకు భక్తులు శ్రీకృష్ణాశ్రమానికి తరలివచ్చారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమంలో మంగళవారం శ్రీ సీతారాం గురుదేవులు తమ శిష్యుల పూజలు అందుకున్నారు. శ్రీ లక్ష్మీపతి స్వామివారి ఆలయంలో శ్రీ సీతారాం గురుదేవుల పర్యవేక్షణలో పూర్ణిమ అభిషేకాలు నిర్వహించారు. మండలంలోని పెదపూడి, కూచిపూడి, మొవ్వ, నిడుమోలు, కోసూరు, నర్సంపాలెం, గూడపాడు గ్రామాల్లోని సద్గురు శ్రీ షిర్డీ సాయినాథుడు, శ్రీ సత్యసాయిబాబా మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. బాబావారి దివ్య విగ్రహాలకు అభిషేకాలు, సుప్రభాత సేవ, నారాయణ సేవ, పల్లకీ సేవలను సత్యసాయి సేవాదళ్ భక్తులు, శ్రీ షిర్డీ సాయినాథ భక్తులు నిర్వహించి సంకీర్తనలో పాల్గొన్నారు.