కృష్ణ

చోరీకి వచ్చి పట్టుబడిన యువకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుగంచిప్రోలు, జూలై 19: పట్టపగలే ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన మండలంలోని అనిగండ్లపాడు గ్రామంలో మంగళవారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం అనిగండ్లపాడు గ్రామ టిడిపి ప్రముఖుడు, సహకార సంఘ ఉపాధ్యక్షుడు తొట్టెంపూడి మురళి తన కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులకు వెళ్లగా ఇద్దరు యువకులు ఇంటి వెనుక వైపు నుండి జొరబడి చోరీకి పాల్పడుతుండగా గమనించిన పక్క ఇంటి ముసలమ్మ కేకలు వేయగా వారు బాత్‌రూమ్‌లోకి వెళ్లి దాక్కున్నారు. ఇదే సమయంలో ఇంటి యజమాని మురళి ఇంటికి రాగా జరిగిన విషయం ముసలమ్మ ఆయనకు తెలియజేయడంతో గ్రామస్తుల సహకారంతో బాత్‌రూమ్ తలుపు తీసి ఇద్దరు యువకులను పట్టుకొని ట్రైనీ ఎస్‌ఐ రాజేష్‌కు అప్పగించారు. వీరిని విచారణ నిమిత్తం జగ్గయ్యపేట సర్కిల్ కార్యాలయానికి తరలించారు. దీనిపై ట్రైనీ ఎస్‌ఐ రాజేష్ మాట్లాడుతూ చోరీలకు పాల్పడిన యువకులు ఖమ్మం జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన ధర్మపురి సాయి కృష్ణ, కొమ్మరబోయిన సీతారాములుగా గుర్తించినట్లు తెలిపారు.