కృష్ణ

భారత సంస్కృతిలో గురువుల పాత్ర ఎనలేనిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, జూలై 19: సనాతన భారత సంస్కృతిలో గురువుల పాత్ర ఎంతో కీలకమైనదని ప్రముఖ యోగాచార్యులు వెంకటేశ్వర యోగి గురూజీ పేర్కొన్నారు. మంగళవారం గురుపూర్ణిమ సందర్భంగా గోసాలలో నిర్వహించిన గురు పూజా మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసరింపచేసేవారు, కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలను ఆచరిస్తూ శిష్యుల చేత ఆచరింప చేసేవారే ఉత్తమ గురువులన్నారు. వేదవ్యాస మహర్షి పుట్టిన రోజును గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నామన్నారు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వాటిని వైశంపాయనుడు, జైమిని, సుమంతు, పైలుకి వ్యాసుడు నేర్పించాడని తెలిపారు. అలా వారు నేర్చుకున్న వేదాలే నేడు ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదంగా చలామణి అవుతున్నాయన్నారు. మన దేశంలో అధిక శాతంగా ఉన్న మధ్య తరగతి వ్యవస్థ చాలా ఒత్తిడి ఎదుర్కొంటోందని, దీనికి యోగా దివ్య ఔషధంగా పనిచేస్తుందని వెంకటేశ్వరయోగి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన 39 మంది యోగా గురువులకు సత్కారాలు చేశారు. గోసాలలో అక్షర యోగా గురువులకు సత్కారం, పూజలు చేశారు. గోసాలలో అక్షర యోగా ధ్యాన మందిర నూతన భవనాన్ని ప్రారంభించారు. యువ యోగి నేరెళ్ల తులసీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యోగ సాధకులు, స్థానిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.