కృష్ణ

కొల్లేరులో మళ్లీ అక్రమ తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండవల్లి, జూలై 21: కొల్లేరు అభయారణ్యంలో మళ్లీ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కొల్లేరు ఆపరేషన్‌లో ధ్వంసం చేసిన చెరువులను రాజకీయ నాయకుల అండదండలతో పునరుద్ధరిస్తున్నారు. మండలంలోని చింతపాడు, పులపర్రు గ్రామాల పరిధిలో కొల్లేరు భూములను మంచినీటి చెరువుల కోసం అంటూ అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో చింతపాడులో సుమారు 5 ఎకరాలు, పులపర్రులో 10 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యాన్ని గురువారం ఉదయం చెరువులుగా మార్చే పనులను ప్రారంభించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ మండవల్లి సెక్షన్ అధికారి గంగారత్నం సిబ్బందితో కలిసి పనులను అడ్డుకునేందుకు వెళ్లగా గ్రామస్థులు వారిని అడ్డగించారు. కొల్లేరు అభయారణ్యంలో అక్రమంగా చెరువులు తవ్వుతున్నా అటవీ శాఖ అధికారులు చోద్యం చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకరరావు అనుచరులు చింతపాడు నుండి యాగిరిమిల్లికి వెళ్లేందుకు రహదారి నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లాలోని కొల్లేరు అభయారణ్యంలో కూడా అదేవిధంగా అక్రమ తవ్వకాలు చేపట్టారు. పొక్లైన్‌లు, ఆయిల్ ఇంజన్ల ద్వారా ఎలాంటి తవ్వకాలు జరపరాదని నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ రెండు గ్రామాల్లో గ్రామపెద్దలు పొక్లైన్‌తో యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగించారు. అధికారులు, మీడియా ప్రతినిధులు సంఘటనా స్థలికి వెళ్లకుండా గ్రామస్థులు టెంట్లు వేసి బైఠాయించి అడ్డుకున్నారు. దీనిపై సెక్షన్ అధికారి గంగారత్నం వివరణ కోరగా పులపర్రులో ఎనిమిది మందిపై, చింతపాడులో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అటవీ శాఖ రీజినల్ అధికారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని గంగారత్నం వివరించారు.