కృష్ణ

విద్యుద్ఘాతానికి ఇద్దరు బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 7: రెక్కాడితే గాని.. డొక్కాడని కూలీలు వారు.. రోజుమాదిరిగానే పనికి వచ్చి మృత్యువాత పడ్డారు. నడిరోడ్డుపై విధులు నిర్వహిస్తూ విద్యుద్ఘాతానికి గురై ప్రాణాలు వదిలారు. ఇద్దరు బడుగులను హైటెన్షన్ వైర్లు బలి తీసుకోవడంతో ఆ రెండు కుటుంబాలు అనాథలయ్యాయి. పొట్టకూటి కోసం పొరుగు జిల్లా నుంచి ఇక్కడకు వలస వచ్చిన ఆ బతుకులు నిత్యం జీవన పోరాటం సాగిస్తూ ఎక్కడోచోట బలవుతూనే ఉన్నాయి. నగరంలో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడిగి గ్రామానికి చెందిన పాలూరు సత్తిపండు (35), సత్తి సత్యనాగు (20) అనే ఇద్దరు గురువారం సాయంత్రం కరెన్సీనగర్‌లో విద్యుద్ఘాతానికి గురై మృతి చెందారు. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్, సిఆర్‌డిఏ పర్యవేక్షణలో కొనసాగుతున్న రామవరప్పాడు-బెంజిసర్కిల్ జాతీయ రహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డు మధ్య డివైడర్‌లో చెట్లు నాటుతున్నారు. కొద్దిరోజులుగా ఈ పనులు కొనసాగుతున్నాయి. ఆయా సంస్థల నుంచి ప్రైవేటు కాంట్రాక్టర్లు కాంట్రాక్టు తీసుకోగా తూర్పుగోదావరి జిల్లా నుంచి కొందరు వర్కర్లు నగరానికి వచ్చి కాంట్రాక్టు వర్కర్లుగా పని చేస్తున్నారు. మడిగి గ్రామానికి చెందిన పాలూరు సత్తిపండు, సత్తి సత్యనాగులతోపాటు మరో పది మంది రోజులాగే పనులకు హాజరయ్యారు. రామవరప్పాడు నుంచి బెంజిసర్కిల్ వరకు పనులు జరుగుతుండగా లారీలో చెట్లు తీసుకువచ్చి డివైడర్ మధ్యలో నాటుతున్నారు. కరెన్సీనగర్ మ్యాంగో ట్రీ రెస్టారెంట్ సమీపానికి వచ్చేసరికి హైవే పైకి మలుపు లారీ మలుపు తిరుగుతున్న క్రమంలో లారీలోని చెట్టును డివైడర్ మీదకు తరలించే సమయంలో చెట్టు పైభాగం పైన ఉన్న హైటెన్షన్ వైర్లకు తగిలింది. దీంతో వెంటనే కరెంటు షాకు తగిలి చెట్టును తరలిస్తున్న సత్తిపండు, సత్యనాగులు అక్కడికక్కడే కింద పడిపోయారు. వెంటనే తోటి కార్మికులు వారిని ఆస్పత్రికి తరలించేసరికి ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న కాంట్రాక్టర్, మరోవైపు విద్యుత్‌శాఖాధికారులు సంఘటనాస్థలాన్ని చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పటమట పోలీసులు ఇక్కడకు చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించి తోటి కార్మికుడు కుడిపూడి ముసలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం కుటుంబ సభ్యుల సమక్షంలో పంచనామా, పోస్టుమార్టం నిర్వహించనున్నారు.